Siddhu Jonnalagadda: టిల్లుగాడి నెక్స్ట్ మూవీ స్పై యాక్షన్ థ్రిల్లర్.. సినిమా పేరు, హీరోయిన్ ఎవరో తెలుసా?
సిద్ధు జొన్నలగడ్డ.. ఈ పేరు తెలిసిన వాళ్లకుంటే కూడా.. టిల్లు గాడు అంటేనే గుర్తు పట్టే వాళ్ల సంఖ్య ఎక్కువ. ఆయన హీరోగా చేసిన డీజే టిల్లు సినిమాతో ఇంత క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా రాధికా.. రాధికా అంటూ ప్రేమించిన అమ్మాయి చుట్టూ తిరిగి తెచ్చుకున్న సమస్యలు అందరినీ కడుపుబ్బా నవ్వించాయి. ఆ సినిమా హిట్ కావడంతో నెక్స్ట్ టిల్లు 2తో రాబోతున్నాడు. అయితే ఈ సినిమా విడుదల కూడా కాకముందే ఈ కుర్ర హీరో మరో సినిమా షూటింగ్ ను కూడా ప్రారంభించేశాడు. ఆ సినిమా పేరంటి, మిగతా వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సిద్ధు జొన్నలగడ్డ ముందుగా ఆర్టిస్ట్ గా కెరియర్ ప్రారంభించాడు. అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేశాడు కూడా. 2009లో జోష్ సినిమాలో మెరిసిన ఈయన.. ఆ తర్వాత ఆరెంజ్, భీమిలి కబడ్డీ జట్టు, లైఫ్ బిఫోర్ వెడ్డింగ్, బాయ్ మీట్స్ గర్ల్, గుంటూరు టాకీస్, కల్కి, కృష్ణ అండ్ హిజ్ లీలా, మా వింత గాధ వినుమా వంటి చిత్రాల్లో కనిపించి తెలుగు సినీ ప్రియులను మెస్మరైజ్ చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి డీజే టిల్లు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టు కావడంతో టిల్లు 2 కూడా చేస్తున్నారు.

అయితే టిల్లు 2 విడుదల కూడా కాముందే ఆయన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసేశారు. ఈరోజు ఆయన పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీం ఫస్ట్ లుక్ వీడియోను కూడా విడుదల చేసింది. అలాగే టైటిల్ నేమ్ ఏంటి, హీరోయిన్ ఎవరో చెప్పేశారు. ముఖ్యంగా సిద్ధు ఎప్పటిలాగా కాకుండా ఈసారి సరికొత్త జానర్ లో చేయబోతున్నారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆ సినిమా పేరే "జాక్". బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో సిద్ధు జాక్ సినిమాలో నటించబోతున్నాడు.

జాక్ సినిమాలో హీరోయిన్ గా బేబీ బ్యూటీ వైష్ణవీ చైతన్య ఛాన్స్ కొట్టేసింది. అలాగే శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బీవీఎన్ఎస్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. టిల్లు హీరోగా చేస్తున్న ఈ సినిమాకు హ్యారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చనున్నట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ జరపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోను విడుదల చేయగా.. అందులో సిద్ధు చాలా హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు.
రెండు చేతుల్లో గన్స్ పట్టుకుని యమా స్టైలిష్ గా కనిపిస్తున్న సిద్ధు టీషర్టుకు బ్యాక్ సైడ్ లో స్టార్ బాయ్ సిద్ధు అని రాసి ఉంది. చేతిలో గన్స్ పట్టుకుని ఓ గోడకు ఆనగా.. బ్యాక్ సైడ్ లుక్ ను చూపించారు. కూలింగ్ గ్లాసెస్ విత్ సూపర్ సింపుల్ వాచ్ పెట్టుకున్న సిద్ధు ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు అర్థం అవుతోంది.


Click it and Unblock the Notifications











