క్రేజీ హీరో సాహసం.. 37 రోజుల్లో ఎంత బరువు తగ్గాడో తెలుసా!
తమిళ స్టైలిష్ హీరో శింబు ఇటీవల మంచి చిత్రాలు చేస్తున్నాడు. ప్రస్తుతం శింబు కెరీర్ గ్రాఫ్ స్టడీగా ఉంది. భవిష్యత్తులో శింబు మరిన్ని క్రేజీ చిత్రాలకు సిద్ధం అవుతున్నాడు. శింబు గత ఏడాది మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన చక్క చివంత వానం చిత్రంలో నటించాడు. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఈ ఏడాది విడుదలైన అత్తారింటికి దారేది రీమేక్ చిత్రం నిరాశపరిచింది. ప్రస్తుతం శింబు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఈ చిత్రంలో శింబు పాత్ర వైవిధ్యంగా ఉంటుందట. దీని కోసం బరువు తగ్గాలని దర్శకుడు శింబుకి సూచించాడు. దీనితో శింబు బరువు తగ్గడంపై దృష్టి పెట్టి కేవలం 37 రోజుల్లోనే 13 కేజీలు తగ్గినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శింబు స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నాడు. కేవలం 37 రోజుల్లో 13 కేజీలు బరువు తగ్గడం అంటే ఒకరకంగా సాహసమే అని చెప్పొచ్చు. మే నెలలో ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

ఈ చిత్రానికి 'మానడు' అనే టైటిల్ ఖరారు చేశారు. యంగ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్ గా నటిస్తోంది. కళ్యాణి ప్రియదర్శన్ ఇటీవలే చిత్రలహరి చిత్రంతో విజయం సొంతం చేసుకుంది. తన సోదరుడి పెళ్లి కార్యక్రమాల్లో బిజీగా ఉన్న శింబు ఫోటోలు వైరల్ అవుతున్నాయి. శింబు స్టైలిష్ లుక్ చాలా బావుందంటూ ప్రశంసిస్తున్నారు.


Click it and Unblock the Notifications











