Nikhil Simbu: నిఖిల్ కోసం కోలీవుడ్ స్టార్ హీరో.. టైమ్ ఇవ్వూ అంటూ

విభిన్నమైన స్టోరీస్​ను సెలెక్ట్​ చేసుకుంటూ తనదైన ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకున్నాడు టాలీవుడ్​ యంగ్​ హీరో నిఖిల్​ సిద్ధార్థ్​. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఈ యంగ్ హీరో. ఈ ఒక్క సినిమాతో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయ్యాడు నిఖిల్. శ్రీకృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నిఖిల్ కి జోడిగా బ్యూటిఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి నిఖిల-అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పేజీస్. ఈ సినిమా నుంచి తాజాగా ఒక క్రేజీ న్యూస్ విడుదల చేశారు. నిఖిల్ కోసం కోలీవుడ్ స్టార్ రంగంలోకి దిగనున్నాడు.

హిట్ కాంబోగా జోడి..

హిట్ కాంబోగా జోడి..

టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ అండ్ బ్యూటీఫుల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తొలిసారిగా జోడి కట్టిన చిత్రం కార్తికేయ 2. చందూ మొండేటి దర్శకత్వంలో రెండోసారి నిఖిల్ హీరోగా నటించిన ఈ మూవీ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. 2014లో వచ్చిన కార్తికేయ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో కొద్దిపాటు అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ 2 సౌత్, నార్త్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లు రాబట్టింది. అనంతరం ఓటీటీలో విడుదలై కూడా రికార్డ్ క్రియేట్ చేసింది కార్తికేయ 2. దీంతో నిఖిల్-అనుపమ పరమేశ్వరన్ జోడి హిట్ కాంబినేషన్ గా మారింది.

డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు..

డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు..

నిఖిల్ సరసన మరోసారి జోడి కట్టనుంది బ్యూటిఫుల్ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. సుకుమార్ అందించిన కథతో రూపొందుతోన్న చిత్రం 18 పేజీస్. ఈ సినిమాకు సుకుమార్ శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ తో కలిసి జీఏ 2 పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ మొదలెట్టేసింది చిత్రబృందం. ఇందులో భాగంగానే ఇదివరకు 'నన్నయ రాసిన' అనే పాటను రిలీజ్ చేశారు. ఇప్పుడు మరో సాంగ్ ను విడుదల చేయనున్నారు.

ఇదే తొలిసారి కాదు..

ఇదే తొలిసారి కాదు..

18 పేజీస్ సినిమా నుంచి వస్తున్న మరో పాటను కోలీవుడ్ స్టార్ శింబు పాడనున్నట్లు మూవీ యూనిట్ పేర్కొంది. "టైమ్ ఇవ్వు పిల్లా.. టైమ్ ఇవ్వు" అంటూ సాగే ఈ పాటను శింబు తనదైన స్టైల్ లో ఎలా పాడారో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే. అయితే శింబు పాట పాడటం ఇదేం తొలిసారి కాదు. ఇదివరకు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ "బాద్ షా" సినిమాలో డైమండ్ గర్ల్, రామ్ పోతినేని "ది వారియర్" చిత్రంలో బుల్లెట్ సాంగ్, "పోటుగాడు"లో బుజ్జి పిల్లా అనే సాంగ్స్ పాడి ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరోసారి నిఖిల్ కోసం రంగంలోకి దిగి తన గాత్రాన్ని వినిపించనున్నాడు శింబు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X