అందుకే ఈ హీరోను అంతగా ఇష్టపడేది.. పేద యువతి కలను నిజం చేసి..
సెలబ్రెటీలు ఆర్థిక సహాయలు చాలానే చేస్తుంటారు. కానీ ఈ బిజీ బిజీ లైఫ్ లో పడి చేసిన ఆర్థిక సహాయం ఎంతవరకు ఉపయోగపడిందనే విషయం పెద్దగా పట్టించుకోరు. కానీ కొంతమంది స్టార్స్ ప్రతి పైసా ఉపయోగపడే విధంగా సహాయలు చేస్తారు. కష్టాన్ని తప్పించే వరకు మొదటి నుంచి తుది వరకు తోడుగా ఉండాలని అనుకుంటారు. సోనూ సూద్ అలానే ఫేమస్ అవుతున్నాడు. ఇక తమిళ్ హీరో శివ కార్తికేయన్ కూడా దాదాపు అలాంటి మంచి పనులతో క్రేజ్ అందుకుంటున్నాడు.

అందుకే శివ కార్తికేయన్ ను లైక్ చేస్తారు
కోట్ల రూపాయలు డోనేషన్స్ చేసే హీరోల కన్నా కూడా ఒక వ్యక్తి కష్టాన్ని తొలగించే హీరోలని ఎక్కువగా గుర్తుంచుకుంటారు జనాలు. ఇక కోలీవుడ్ లో కష్టపడి పైకొచ్చిన శివకార్తికేయన్ అంటే తమిళ జనాలు బాగా లైక్ చేస్తారు. అందుకు కారణం అతను చేసే సహాయలు. వీలైనంత వరకు ఒక మనిషి కష్టానికి తోడుగా నిలిచి బయటపడేయడం నిజమైన హీరో లక్షణం.

బాధ్యత తీసుకున్న హీరో
ఇక శివ కార్తికేయన్ ఒక పేద విద్యార్థి కలను నిజం చేసుకునే బాధ్యతను తీసుకున్నాడు. ఆ విద్యార్థిని సగం వరకు తన గమ్యాన్ని చేరుకొని హీరోకు మరింత నమ్మకాన్ని కలిగించింది. అసలు మ్యాటర్ లోకి వెళితే.. తంజావూర్ జిల్లా పేరావురణి సమీపాన ఉన్న పూకొల్లై ప్రాంతానికి చెందిన సహానా స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ప్లస్ టూ వరకు చదువుకుంది. డాక్టర్ కావలన్నది ఆమె కల.

ఇల్లు కూలిపోవడంతో..
అయితే తల్లితండ్రులకు కూలి పని చేస్తుంటారు. ఖరీదైన డాక్టర్ చదువును చదివించలేని పరిస్థితి. అయితే దురదృష్టవశాత్తు 2018లో వచ్చిన గజ తుఫాను కారణంగా వీరి ఇల్లు కూడా కూలిపోయింది. దీంతో ఆ అమ్మాయి వీధి లైట్ల కిందే చదువుకునేది. ఇక 524 మార్కులతో ప్లస్ టూ ఉత్తీర్ణత సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. పేపర్ లో న్యూస్ చూసిన తంజావూర్ కలెక్టర్ అన్నాదురై ఆమె ఇంటికి వెళ్లి రెండు సోలార్ లైట్లతో పాటు ఆర్థిక సహాయం కూడా చేశాడు.

హీరో నమ్మకాన్ని నిలబెట్టిన విద్యార్థిని
ఇక విషయం తెలుసుకున్న హీరో శివకార్తికేయన్ ఆమెకు మరింత సహాయం అందించాడు. ఓ ప్రైవేట్ కాలేజీలో ఆమెకు నీట్ కోచింగ్ కోసం సహాయం చేశాడు. ఇక ఆ విద్యార్థిని నీట్ పరీక్షలో 273 మార్కులను సాధించి తిరుచ్చిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు సాధించగలిగింది. భవిష్యత్ లో కూడా ఈ హీరో మరింత సహాయం చేస్తానని హామీ కూడా ఇచ్చాడు. ఇక తన కలను నెరవేర్చుకునేందుకు విద్యార్థిని సహాన శివకార్తికేయన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపింది.


Click it and Unblock the Notifications











