Sivakarthikeyan: అమరన్ కోసం భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన శివ కార్తికేయన్‌.. ఎన్ని కోట్లంటే..?

Amaran: దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా అమరన్. ఈ మూవీలో ముకుంద్ పాత్రలో శివకార్తీకేయన్ (Siva karthikeyan), ఆయన భార్య ఇందు రెబాకా వర్గీస్ పాత్రలో సాయి పల్లవి(Sai Pallavi) నటించారు. ఈ మూవీకి తమిళంతో పాటు తెలుగులో కూడా.. మంచి ఓపెనింగ్ సాధించింది. ఈ తరుణంలో అమరన్ మూవీ హీరోగా నటించడానికి శివ కార్తికేయన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఇంతకి శివ కార్తికేయన్ ఎన్ని కోట్ల రెమునరేషన్ తీసుకున్నారంటే..

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ అమరన్ . తమిళ స్టార్ హీరో శివ కార్తీకేయన్, టాప్ హీరోయిన్ సాయిపల్లవి జంటగా నటించారు. ఇండియన్ సినిమా రంగంలో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ నిర్మాతగా మారి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సోని ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌తో కలిసి నిర్మించిన ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించారు.ఎమోషనల్ ట్రాజెడీగా తెరకెక్కిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న రిలీజైంది.

Sivakarthikeyan remuneration for Amaran movie full details here

ప్రముఖ రచయితలు శివ్ అరూర్, రాహుల్ సింగ్ సంయుక్తంగా రచించిన ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడరన్ మిలిటరీ హీరోస్ అనే పుస్తకం ఆధారంగా చేసుకొని మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా అమరన్ మూవీని తెరకెక్కించారు. జమ్ము, కశ్మీర్‌లో మిలిటెంట్లను అత్యంత ధైర్య సాహసంతో ఎదుర్కొని యుద్ధభూమిలో అమరుడైన ఈ యోధుడి కథ ఇది. అమరన్ సినిమాలో సాయి పల్లవి, శివ కార్తీకేయన్ జంటగా నటించడంతో భారీ హైప్ క్రియేట్ అయ్యాయి. ఈ మూవీ కోసం దాదాపు 200 కోట్లు వెచ్చించారట. విడుదల అనంతరం పాజిటివ్ రావడంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతున్నది.

ఇక కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ గురించి, ఆయన సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు కోలీవుడ్ లోనే టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు ప్రేక్షకులు కూడా శివ కార్తికేయన్ మూవీస్ ఎంతగానో ఆదరిస్తుంటారు. ఆయన సినిమాలను చాలా ఇష్టపడతారు. ఆయన హీరోగా వచ్చిన వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, మహావీరుడు వంటి సినిమాలు తెలుగులో కూడా మంచి విజయం సాధించాయి. దాంతో ఆయన సినిమాలకు కూడా మంచి డిమాండ్ ఏర్పడింది. అయలన్ మూవీ లో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. తాజాగా మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ అమరన్ లో నటించారు.

Sivakarthikeyan remuneration for Amaran movie full details here

ఇక హీరో హీరోయిన్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే..కార్తికేయ‌న్ రెమ్యూనరేషన్ గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. ప్రస్తుతం తెలుగులో తన మార్కెట్‌ను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు కార్తికేయన్. అమరన్ సినిమాకి సాయి పల్లవి ఏకంగా మూడు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుందనే వార్త నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే..? సాయి పల్లవి.. మూడు కోట్లు తీసుకుంటే.. శివ కార్తికేయన్ పది రేట్లు ఎక్కువ తీసుకున్నారంట. అంటే.. దాదాపు 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించి శివ కార్తికేయన్ మొత్తం తన భూజలపైనే వేసుకున్నట్లు చర్చ జరుగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X