ఇక్కడంతా ఎన్నికల టెన్షన్... మెగాస్టార్ చిరంజీవి అక్కడ కూల్‌గా (ఫోటోస్)

సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి రగులుకుంది. గెలుపు ఎవరిది, అధికారంలోకి రాబోయేది ఎవరు? అంటూ యావత్ భారతదేశ ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‍‌లో ఎన్నికల పోరు రసవత్తరంగా సాగుతోంది.

ఈ సారి మెగాస్టార్ సోదరుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'జనసేన' పార్టీ తరుపున ఎన్నికల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి మరో సోదరుడు నాగబాబు కూడా ఎంపీగా పోటీ చేస్తూ ప్రచార పర్వంలో మునిగి పోయారు. ఇక్కడ అంతా ఎన్నికల టెన్షన ఉంటే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఈ టెన్షన్ వాతావరణానికి దూరంగా వెళ్లిపోయారు.

జపాన్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్

జపాన్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం జపాన్‌లో హాలిడే ఎంజాయ్ చేస్తున్నారు. తన భార్య సురేఖతో కలిసి ఆయన ఆ దేశంలోని మంచు కొండల్లో విహరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సైరా షూటింగ్ నుంచి బ్రేక్

సైరా షూటింగ్ నుంచి బ్రేక్

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సైరా నరసిహారెడ్డి' చిత్రంలో నటిస్తున్న మెగాస్టార్ చిరంజీవి షూటింగ్ నుంచి చిన్న విరామం తీసుకున్నారు. అక్కడ వివిధ ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం తిరిగి షూట్లో బిజీ కాబోతున్నారు.

ఎన్నికల వేళ కావాలనే దూరంగా..?

ఎన్నికల వేళ కావాలనే దూరంగా..?

మెగాస్టార్ చిరంజీవి కేవలం యాక్టర్ మాత్రమే అయితే ఎవరూ పెద్దగా పట్టించుకునే వారు కాదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకభూమిక పోషించిన పొలిటీషియన్. కేంద్ర మంత్రిగా కూడా పని చేశారు. ఈ ఎన్నికల వేళ ఆయన తన సోదరుడు పవన్ కళ్యాణ్ పార్టీ తరుపున ప్రచారం చేస్తారని అంతా భావించారు. అయితే అందరి అంచనాలు తారు మారు చేస్తూ కావాలనే దూరంగా వెళ్లిపోయారు. రాజకీయ రంగంలో తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలే మెగాస్టార్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని తెలుస్తోంది.

చిరంజీవికి సరిపడని రాజకీయాలు

చిరంజీవికి సరిపడని రాజకీయాలు

పదేళ్ల క్రితం భారీ అంచనాలతో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి...2009 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆశించిన స్థాయిలో సీట్లు గెలవక పోవడం, పార్టీ అంతర్గత కారణాల వల్ల దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు పర్యాటకశాఖ మంత్రిగా సేవలందించారు. అయితే తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏపీలో చిత్తుగా ఓడిపోవడంతో చిరంజీవి రాజకీయాలకు దూరం అయ్యారు. తన పూర్తి ఫోకస్ సినిమాలపై పెట్టారు.

ఇకపై పూర్తిగా సినిమాల్లోనే

ఇకపై పూర్తిగా సినిమాల్లోనే

తన 150వ చిత్రం ‘ఖైదీ నెం.150' ద్వారా సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన చిరంజీవికి అభిమానులు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. దీంతో ఆయన తనకు బాగా పట్టున్న సినిమా రంగంలోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి' చిత్రంలో నటిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీ ఇది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X