For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అల్లు అర్జున్ కట్నంపై స్నేహ రెడ్డి తండ్రి షాకింగ్ కామెంట్స్.. ఎంత ఇచ్చారంటే?

  |

  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఐకాన్ స్టార్ గా మరో రేంజ్ కి వెళ్ళాడు. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2తో సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇక అల్లుఅర్జున్ ఒకవైపు సినిమాల గురించి ఆలోచిస్తూనే మరొకవైపు ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ కు అమ్మాయినిచ్చిన మామ కే చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయటపెట్టారు అల్లుఅర్జున్ కట్నంపై కూడా ఆయన ఎవరూ ఊహించని విధంగా స్పందించారు. ఆయన ఏమన్నారు అనే వివరాల్లోకి వెళితే..

  పుష్ప సినిమాతో..

  పుష్ప సినిమాతో..

  అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ఎలాంటి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా భారీ స్థాయిలో లాభాలను అందించింది. ముఖ్యంగా హిందీ లోనే ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ అందుకోవడంతో అల్లు అర్జున్ బ్రాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఇప్పుడు పుష్ప 2పై అయితే అంతకు మించి అనేలా అంచనాలు ఏర్పడుతున్నాయి.

  ఫ్యామిలీ మ్యాన్

  ఫ్యామిలీ మ్యాన్

  ఇక అల్లు అర్జున్ సినిమా షూటింగ్ తో ఎంత బిజీగా ఉన్నా కూడా తన కుటుంబ సభ్యులతో కూడా ఇప్పటికీ టచ్ లోనే ఉంటారట. ముఖ్యంగా తన ఇద్దరు పిల్లలతో కూడా దాన్ని ఏ విధంగా ఎంజాయ్ చేస్తాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటికి వస్తే తన గారాల కూతురు అర్హతోనే ఎక్కువగా ఉంటానని చాలా ఇంటర్వ్యూలలో బన్నీ తెలియజేశాడు.

  కలవడం కుదరకపోతే..

  కలవడం కుదరకపోతే..

  కొన్నిసార్లు సినిమా షూటింగ్ కారణంగా కుటుంబ సభ్యులను కలవడం కుదరకపోతే వారిని షూటింగ్ స్పాట్ దగ్గరకు వచ్చేలా చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా హాలిడేస్లో అల్లు అర్జున్ సరదాగా విదేశాలకు వెళ్లి వస్తూ ఉంటాడు. ఒకవైపు మంచి స్టార్ హీరోగా మరొకవైపు మంచి ఫ్యామిలీ పరంగా అల్లు అర్జున్ మిగతా హీరోలకు కూడా స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారు అని చెప్పవచ్చు.

   బన్నీ లవ్ స్టొరీ

  బన్నీ లవ్ స్టొరీ


  సాధారణంగా అందరూ అల్లు అర్జున్ పెద్దలు కుదిర్చిన వివాహమే అని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. బన్నీ ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఒక పబ్ లో మొదటిసారి స్నేహ రెడ్డి ని చాలా సింపుల్ గా చూసిన బన్నీ మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయాడు. కొన్ని రోజులపాటు వీరి మధ్య కొనసాగిన స్నేహం ఆ తర్వాత పెళ్లి వరకు వెళ్ళింది.

   అల్లు అర్జున్ కట్నం..

  అల్లు అర్జున్ కట్నం..

  అయితే అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని పెళ్లి చేసుకోవడానికి కట్నం కూడా భారీ స్థాయిలోనే తీసుకున్నట్లు అప్పట్లో అనేక రకాల కథనాలు వెలువడ్డాయి. స్నేహ రెడ్డి తండ్రి కే చంద్రశేఖర్ కూడా రాజకీయాల్లో చాలా బిజీగా ఉండటం వలన ఆయన కూడా చాలా సంపన్నులు కాబట్టి తప్పకుండా డా గట్టిగానే కట్నం ఇచ్చి ఉంటాడని కూడా సోషల్ మీడియాలో టాక్ వచ్చింది.

  కట్నంపై క్లారిటీ

  కట్నంపై క్లారిటీ

  ఇక ఇటీవల అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కట్నం గురించి వివరణ ఇచ్చాడు నిజానికి అల్లు అర్జున్ ఎలాంటి కట్నం తీసుకోలేదు అని అలాంటి వాటికి అల్లు అర్జున్ మాత్రమే కాకుండా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా విరుద్ధమని తెలియజేశారు. కట్నాలు ఇవన్నీ కూడా మెగా ఫ్యామిలీలో ఉండవు అంటూ కుదిరితే ఇతరులకు సహాయం చేయాలి అని చూస్తారు అని అన్నారు.

  గొప్ప స్థాయిలో..

  గొప్ప స్థాయిలో..

  ఇంతవరకు అల్లు అర్జున్ తన నుంచి ఏదీ ఆశించలేదు అని అయినా వారే గొప్ప స్థాయిలో ఉన్నారని మేము ఏది ఇచ్చినా కూడా అది తక్కువే అవుతుందని అన్నారు. అంతేకాకుండా అల్లు అర్జున్ తన దగ్గర పనిచేసే వారిని అలాగే మిగతా కుటుంబ సభ్యులకు కూడా ఎల్లప్పుడూ సహాయం చేసే విధంగానే ఆలోచిస్తాడు అని అల్లుడిగా అతనికి వందకు వంద మార్కులు పడాల్సిందే అని కూడా ఆయన సంతోషంగా వివరణ ఇచ్చారు.

  English summary
  Sneha reddy father about Allu arjun dowry details
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X