'ఆ కష్టకాలంలో అండగా.. అందుకే శోభిత అంటే..'
సినిమా లేదా క్రికెట్ రంగాలలో చాలా మంది స్టార్స్ తమ తోటి స్టార్స్ తో డేటింగ్ లు పెళ్లిళ్లు ఆ తర్వాత విడిపోవడం వరకు కూడా వెళ్లిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కాగా మన తెలుగులో కూడా చాలా మంది స్టార్ హీరోలు అలాగే హీరోయిన్స్ ఒకరికి ఒకరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు ఉన్నారు. కాగా ఈ అందరిలో కూడా ఒకప్పుడు మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్న అతి కొంతమంది జంటల్లో అక్కినేని నాగ చైతన్య అలాగే హీరోయిన్ సమంతల జంటే అని చెప్పవచ్చు.
కాగా ఇద్దరు కొన్నేళ్లు ఎంతో అన్యోన్యంగా జీవించారు కానీ తర్వాత అనూహ్యంగా విడిపోవాల్సి వచ్చింది. కాగా దీనికి కారణం ఇప్పటికీ గోప్యమే కానీ ఎట్టకేలకి ఇద్దరు విడివిడిగా కొత్త జీవితాలు లీడ్ చేస్తున్నారు. ఇక ఈ తర్వాత సమంత సినిమాలు, వెబ్ సిరీస్ లు వాటితో పాటుగా ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. కానీ నాగ చైతన్య మాత్రం వరుస ప్లాప్ లలో మునగాల్సి వచ్చింది.

లవ్ స్టోరీ తర్వాత తన నుంచి మళ్ళీ హిట్ లేదు. ఇలా ఓటిటిలో దూత సిరీస్ తో తాను హిట్ కొట్టగా ఆ తర్వాత సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాల గ్యాప్ లోనే నాగ చైతన్య రెండో పెళ్లిపై క్రేజీ ట్విస్ట్ ఇచ్చాడు. తనతో పాటుగా టాలీవుడ్ లోనే కాకుండా ఏకంగా హాలీవుడ్ వరకు కూడా వెళ్లిన తెలుగు నటి శోభిత ధూళిపాళని రెండో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసాడు.
కాగా తన రెండో భార్య విషయంలో మాత్రం నాగ చైతన్య చాలా హ్యాపీగానే ఉన్నట్టే ఉన్నాడని చెప్పవచ్చు. ఇలా తన భాగస్వామిపై చేసిన లేటెస్ట్ కామెంట్స్ కొన్ని వైరల్ గా మారాయి. తాను ఏదన్నా సందర్భంలో చాలా కన్ఫ్యూజ్ గా ఉన్నపుడు శోభితతో ఆ విషయాన్ని షేర్ చేసుకుంటాడట. అలాగే ఇంట్రెస్టింగ్ గా శోభిత చైతు ఒకవేళ ఏదన్నా ఒత్తిడిలో ఉంటే వెంటనే కనిపెట్టేస్తుంది అని తెలిపాడు.
అలాంటి సమయంలో ఎందుకు ఏంటి అని అన్నీ కనుక్కొని చాలా క్లియర్ గా నెమ్మదిగా ఆలోచించి ఫైనల్ గా తనకొక పరిష్కారం, సలహాలు చూపిస్తుంది. అందుకే శోభిత ఒపీనియన్స్ ని చాలా గౌరవిస్తాను అని ఆమె నన్ను బాగా అర్ధం చేసుకుంటుంది అంటూ తెలిపాడు. దీనితో తనని అర్ధం చేసుకోవడంలో తన మాజీ భార్య సమంత కంటే శోభిత చాలా బెటర్ అని ఇన్ డైరెక్ట్ గా అంటున్నాడా అని చాలా మందికి అనిపించక మానదు.
దీనితో తన రెండో భార్యపై ఈ కామెంట్స్ మాత్రం మంచి వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం నాగ చైతన్య హీరోగా నటించిన అవైటెడ్ చిత్రం "తండేల్" ఈ ఫిబ్రవరి 7న పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుండగా ఈ సినిమాలో నాగ చైతన్య సరసన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించింది. అలాగే కార్తికేయ 2 ఫేమ్ దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించగా గీతా ఆర్ట్స్ వారు సుమారు 90 కోట్లకి పైగా బడ్జెట్ ని పెట్టినట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి.


Click it and Unblock the Notifications











