శోభితతో అలా సంతానం.. నాగచైతన్య మనసులో మాట ఏమిటంటే?

అక్కినేని నాగార్జున కుటుంబంలో చాలా రోజుల తర్వాత పండగ వాతావరణం నెలకొంది. తొలుత నాగచైతన్య - శోభితల పెళ్లి, ఆ వెంటనే అఖిల్ - జైనాబ్ రబ్జీల పెళ్లితో ఇంట్లో సందడి నెలకొంది. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేర చిత్రంతో నాగార్జున చాలా రోజుల తర్వాత హిట్ కొట్టడంతో ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు. అయితే అక్కినేని ఫ్యాన్స్ కూడా ఆ కుటుంబం నుంచి వారసులు రావాలని ఆశిస్తున్నారు. కొత్త జంటలు త్వరగా శుభవార్తలు చెప్పాలని ఆశిస్తున్నారు. తాజాగా పిల్లలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అక్కినేని నాగచైతన్య. ఈ వివరాల్లోకి వెళితే..

సైలెంట్‌గా షాకిచ్చిన చైతూ- శోభిత

స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుతో విడాకుల తర్వాత మరో హీరోయిన్ శోభిత ధూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎప్పటి నుంచో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నప్పటికీ ఎవ్వరూ బయట పెట్టలేదు. చైతూ- శోభిత మధ్య ఏదో జరుగుతుందని మీడియా పలుమార్లు కథనాలు ప్రసారం చేసినప్పటికీ సినీ జనాలు, అభిమానులు లైట్ తీసుకున్నారు. నాగచైతన్య ఏంటీ.. శోభితతో ప్రేమలో పడటం ఏంటీ? అంటూ కామెంట్స్ చేశారు. కానీ చివరికి సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాకిచ్చారు నాగచైతన్య - శోభిత.

Sobhita Dhulipala Naga Chaitanya s kids planning Chai reveals hilarious plans

అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్‌గా పెళ్లి
వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగా? లేక సింపుల్‌గా తేల్చేస్తారా? అంటూ విస్తృతంగా కథనాలు వచ్చాయి. ఇక శోభిత ఇంట్లో పెళ్లి పనులు మొదలు కావడంతో ఆమె తరచుగా దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ వచ్చింది. చివరికి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో గతేడాది డిసెంబర్‌లో అక్కినేని నాగచైతన్య- శోభిత ధూళిపాళ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన అతిరథ మహారథులు వీరి పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

తండేల్ కోసం హనీమూన్ వాయిదా
పెళ్లి తర్వాత హానీమూన్‌కి వెళ్లకుండా తన తండేల్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు నాగచైతన్య. దీనికి శోభిత సైతం ఎంతో సహకరించారు. నిన్ను క్లీన్ షేవ్‌లో చూడాలని ఉంది సామీ అంటూ సరదాగా పోస్ట్‌లు పెట్టేది. తండేల్ రిలీజ్ అయ్యాక ఘన విజయం సాధించింది. దాంతో శోభిత వచ్చిన వేళా విశేషం బాగుందని.. తమ హీరోకి హిట్ దొరికిందని అక్కినేని అభిమానులు పండగ చేసుకున్నారు. తండేల్ సక్సెస్ మీట్‌కి హాజరైన నాగార్జున సైతం చాలా రోజుల తర్వాత సక్సెస్‌మీట్‌కు వచ్చానని ఎమోషనల్ అయ్యారు. తండేల్ హడావుడి తగ్గిన తర్వాత శోభితను తీసుకుని ఫారిన్‌లో హానీమూన్ ఎంజాయ్ చేశారు చైతూ. ప్రస్తుతం విరూపక్ష ఫేం కార్తీక్ దండు దర్శకత్వంలో నాగచైతన్య తన 24వ చిత్రంలో నటిస్తున్నారు.

పిల్లలతో గడపాలని ఉంది
ఇదిలాఉండగా.. పిల్లల గురించి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నాగచైతన్య. తనకు ఒకరో ఇద్దరో పిల్లలు చాలని.. 50 ఏళ్లు వచ్చేసరికి భార్యాబిడ్డలతో సంతోషంగా ఉండాలన్నది తన కోరిక అని నాగచైతన్య వెల్లడించారు. కొడుకు పుడితే రేసింగ్ నేర్పిస్తానని.. కూతురు పుడితే తనకు ఏది ఇష్టమో అందులో ప్రోత్సహిస్తానని ఆయన పేర్కొన్నారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఉందని నాగచైతన్య చెప్పారు. షూటింగ్స్, సినిమాలతో బిజీగా ఉండటం వల్ల శోభితతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నానని .. తమ మధ్య ఎలాంటి విభేదాలకు చోటు లేకుండా కొన్ని కండీషన్స్ పెట్టుకున్నామని ఆయన తెలిపారు. ఇంట్లో ఉంటే కలిసే భోజనం చేస్తామని.. తనకు రేస్ ట్రాక్‌పై డ్రైవింగ్ కూడా నేర్పించినట్లు అక్కినేని నాగచైతన్య పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X