For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విడుదలకు ముందే శ్యామ్ సింగరాయ్ జాక్ పాట్.. హిందీలో షాకింగ్ డీల్!

  |

  నాచురల్ స్టార్ నాని చాలా కాలం తర్వాత ఒక డిఫరెంట్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రొమాంటిక్ లవ్ కామెడీ డ్రామా అంటూ ఇప్పటివరకు ఎన్నో విభిన్నమైన సినిమాలు ట్రై చేసిన నాని హిస్టారికల్ టైప్ సినిమాలను పెద్దగా టచ్ చేయలేదు. అంతేకాకుండా సూపర్ నేచురల్ వంటి జానార్స్ కూడా టచ్ చేసింది లేదు. మొదటిసారి శ్యామ్ సింగ్ సినిమాతో అలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నట్లు తెలుస్తోంది. టాక్సీవాలా సినిమా తో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న దర్శకుడు రాహుల్ సంకృత్యాన్ తెరకెక్కిస్తున్న శ్యామ్ సింగరాయ్ సినిమా విభిన్నమైన సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

   ఓటీటీ ఫెయిల్యూర్స్

  ఓటీటీ ఫెయిల్యూర్స్

  చూస్తుంటే ఈ సినిమాతో నాని తప్పకుండా తన కెరీర్లో బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ ను సొంతం చేసుకోబోతున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. నాని ఇటీవల కాలంలో కొన్ని సినిమాలతో వరుస డిజాస్టర్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. గత రెండు సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటిటిలో విడుదలవడం కూడా కొంత మైనస్ అని చెప్పవచ్చు. ముందుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో చేసిన V సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన టక్ జగదీష్ సినిమా కూడా అదే తరహాలో ఓటీటీ లో డైరెక్ట్ గా విడుదలైంది.

  బిగ్గెస్ట్ హిట్ పై ఫోకస్

  బిగ్గెస్ట్ హిట్ పై ఫోకస్

  గత రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను పూర్తి స్థాయిలో సంతృప్తి పరచలేక పోయినప్పటికీ నాని మార్కెట్ అయితే ఏ మాత్రం తగ్గలేదు అని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే డిఫరెంట్ సినిమాలు లైన్ లో ఉన్నాయి. ముఖ్యంగా శ్యామ్ సింగరాయ్ సినిమాపై అంచనాలు అయితే గట్టిగానే ఉన్నాయి. శ్యామ్ సింగరాయ్ సినిమాతో నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. నిర్మాతలు కూడా సినిమా కోసం భారీగా ఖర్చు చేశారు.

  దేవుడితో పోరాటం..

  దేవుడితో పోరాటం..

  శ్యామ్ సింగరాయ్ సినిమాలో నాని రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. సాయిపల్లవి ముఖ్యమైన పాత్రలో నటిస్తుండగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి కూడా అతనికి జోడీగా కనిపించబోతోంది. రెండు కాలాలకు సంబంధించిన ఈ కథలో నాని శ్యామ్ సింగరాయ్ పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందని తెలుస్తోంది. ఏకంగా దేవుడి తోనే పోరాటానికి సిద్ధమైతే హీరో ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటాడు అనే పాయింట్ కూడా ఆలోచింపజేస్తుంది. ఇటీవల విడుదలైన టీజర్ కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది.

  అసెంబ్లీ ప్రజా సమస్యలను చర్చించడానికి అకారణంగా దూషించడానికి కాదు - Kalyan Ram || Filmibeat Telugu
   హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంతంటే?

  హిందీ డబ్బింగ్ రైట్స్ ఎంతంటే?

  అయితే సినిమాకు సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా మంచి ధరకు అమ్ముడు పోవడం విశేషం నాని గత సినిమాలన్నీ కూడా హిందీ డబ్బింగ్ రైట్స్ ద్వారా మంచి ఆదాయాన్ని అందించాయి. ఇక ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమా హిందీ హక్కులను B4U ఛానల్ దక్కించుకుంది. హిందీ హక్కులను ఈ ఛానల్ రూ.10కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను సౌత్ లో భారీగా విడుదల చేస్తున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా తమిళం మలయాళం కన్నడ భాషల్లో కూడా ఒకేసారి విడుదల కాబోతోంది. అసలైతే దసరా సమయంలోనే శ్యామ్ సింగరాయ్ సినిమాని విడుదల చేయాలనుకున్నారు. ఇక ఫైనల్ గా డిసెంబర్ 24న విడుదల చేయబోతున్నట్లు ఇటీవల అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు.

  English summary
  Solid deal for Shyam Singha Roy hindi dubbing rights
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X