సోనుసూద్ కంటతడి.. గ్రామస్థుల కష్టాలు చూసి ఆ ఊరంతటికి ఉచితంగా..

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించిన సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు నేనున్నాను అంటూ నటుడు సోనుసూద్ అండగా నిలిచారు. దేశంలోని మారు మూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను తమ సొంత గ్రామాలకు పంపించి ఆదుకొన్నారు. లాక్‌డౌన్ ఎత్తివేసినా ప్రజల కష్టాల్లో భాగమవుతూ వస్తున్నారు. అలాంటి సేవలో నిమగ్నమైన సోను తాజాగా జాతీయ ఛానెల్‌లో నిర్వహించే డ్యాన్స్ దీవానే సీజన్ 2లో హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఓ పేద కళాకారుడిని పరిస్థితి చూసి కంటతడి పెట్టుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే..

రెజీనా కాసాండ్రా.. చీరలో ఎన్ని అందాలో..

లాక్‌డౌన్‌లో కష్టాలను పాట రూపంలో

లాక్‌డౌన్‌లో కష్టాలను పాట రూపంలో

డ్యాన్స్ దీవానే సీజన్ 3 వేదికపై లాక్‌డౌన్‌లో ప్రజల కష్టాలను పేద కళాకారుడు తన డ్యాన్స్ ప్రతిభతో కళ్లకు కట్టినట్టు చూపించారు. తిండి లేని పరిస్థితులను, కాలినడకన నడుస్తూ ప్రజలు పడిన అవస్థలను చూపించాడు. ప్రజల కష్టాలను కడతేర్చిన సోనుసూద్ సేవలను తన డ్యాన్స్ రూపంలో చూపించారు. కళాకారుడి ప్రతిభను చూసి సోను సూద్ కంటతడి పెట్టారు.

రియల్ హీరోవు నువ్వే అంటూ సోనుసూద్

రియల్ హీరోవు నువ్వే అంటూ సోనుసూద్

సోను సూద్ కంటతడి పెట్టుకోవడం చూసి హోస్ట్ భారతీ సింగ్ కన్నీటి పర్యంతమయ్యారు. అంతేకాకుండా వేదికపైన ప్రముఖులు, షోలో పాల్గొనడానికి వచ్చిన వారందరూ కంటతడి పెట్టి ఎమోషనల్ అయ్యారు. ఈ సందర్భంగా సోనుసూద్ మాట్లాడుతూ.. చిన్న పట్టణం నుంచి వచ్చినా.. నీవు రియల్ హీరోవు. చిన్న పట్టణంలో పెద్ద స్టార్వు అంటూ కొనియాడారు.

 నా గ్రామస్థులు కష్టాల్లో

నా గ్రామస్థులు కష్టాల్లో

సోనుసూద్ ప్రశంసతో కంటెస్టెంట్ ఎమోషనల్ అయ్యారు. మీరు చెప్పిన మాటలతో నా గ్రామ ప్రజలందరూ చాలా సంతోషపడుతారు. లాక్‌డౌన్‌లో మా గ్రామ ప్రజలు చాలా కష్టాలు పడ్డారు. వారంతా సొంత గ్రామానికి వచ్చి తిండి కోసం కష్టాలు అనుభవించారు అంటూ కంటెస్టెంట్ కంటతడి పెట్టుకొన్నాడు.

మీ గ్రామానికి సరిపడే రేషన్ అందిస్తా

కంటెస్టెంట్ మాటలకు సోనుసూద్ మనసు కరిగిపోయింది.. లాక్‌డౌన్ ఒక నెల కొనసాగినా.. రెండు నెలలు నడిచినా.. ఆరు నెలలు కొనసాగినా.. ఇంకా ఎంతకాలమైనా ఫర్వాలేదు. మీ గ్రామానికి మొత్తం సరిపడే రేషన్ నా నుంచి వస్తుంది. ఎలాంటి సమస్యలు లేకుండా వాటిని మీకు చేరేలా సహాయం అందిస్తాను అంటూ సోనుసూద్ హామీ ఇచ్చారు. దాంతో అందరూ మరోసారి సొనుసూద్‌ను ప్రశంసలతో ముంచెత్తారు

Recommended Video

Sonu Sood Tests Positive For COVID-19
సోనుసూద్ కెరీర్ ఇలా..

సోనుసూద్ కెరీర్ ఇలా..

సోనుసూద్ సమాజ సేవలో కొనసాగుతూనే సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల కరోనావైరస్ బారిన పడి కోలుకొన్న ఆయన పలువురుకి సహాయం అందిస్తున్నారు. ప్రస్తుతం సొనుసూద్ ఆచార్య, పృథ్వీరాజ్, తమిలారాసన్ చిత్రాల్లో నటిస్తున్నారు. లాక్‌డౌన్ తర్వాత ఆయన నటించిన అల్లుడు అదుర్స్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X