twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రధాని పదవికి రేసులో సోనుసూద్.. వచ్చే ఎన్నికలకు సిద్ధమా? రియల్ హీరో ఇచ్చిన క్లారిటీ ఏమిటంటే!

    |

    పేద ప్రజలు, వలస కార్మికుల జీవితాలను కరోనావైరస్ చిన్నాభిన్నం చేస్తున్న సమయంలో మనిషి రూపంలో ఉన్న దేవుడిగా అందరికీ అండగా నటుడు సోనుసూద్ నిలుస్తున్నారు. గత ఏడాది లాక్‌డౌన్ కాలంలో దేశవ్యాప్తంగా వలస కార్మికులు, పేద ప్రజలకు ఆర్థికంగా, ఇతర రూపంలో సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వచ్చే సాధారణ ఎన్నికల్లో మీరు ప్రధాని అభ్యర్థిగా రేసులో ఉంటే ప్రజలు చూడాలని కోరుకొంటున్నారు అంటూ ఫోటో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ...

    సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో

    సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో

    సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా కోవిడ్ పేషంట్లకు ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నారు. హాస్పిటల్స్‌లో పేషెంట్లకు బెడ్స్ ఏర్పాటు చేయడం, ఆక్సిజన్ సిలిండర్స్ అందించడం, కోవిడ్ బాధితులకు మందులు సరఫరా చేయడం లాంటి ఎన్నో పనుల చేపడుతున్నారు.

    దేశవ్యాప్తంగా ఎన్నో సేవలు

    దేశవ్యాప్తంగా ఎన్నో సేవలు

    ఇటీవల ఓ పేషెంట్‌కు అత్యవసర చికిత్స అవసరం కావడంతో విమానం ద్వారా హైదరాబాద్‌కు తరలించారు. అంతేకాకుండా దేశంలో ఆక్సిజన్ కొరత ఎక్కువగా ఉండటంతో దేశంలో పలు ప్రాంతాల్లో ఆక్సిజన్ ప్లాంట్లను నెలకొల్పాలని ప్లాన్ చేస్తున్నారు. ఫ్రాన్స్, ఇతర దేశాల నుంచి ప్లాంట్లను దిగుమతి చేసుకొని మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో ఏర్పాటు చేయాలని సోనుసూద్ నిర్ణయం తీసుకొన్నారు.

    ప్రధాని పదవి రేసులో ఉంటారా?

    ప్రధాని పదవి రేసులో ఉంటారా?

    ఇలాంటి పరిస్థితుల్లో సోనుసూద్ ప్రధాని కావాలని ప్రజలు కోరుకొంటున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నా సేవలను గుర్తించి ప్రజలు అలా కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ నాకు రాజకీయాలపై ఆసక్తి లేదు. అవి నా మనస్తత్వానికి సరిపడవు. కామన్ మ్యాన్‌గానే ప్రజలకు సహాయం చేస్తూ ఉంటాను అని సోనుసూద్ సమాధానం ఇచ్చారు. అంతకంటే నాకు ఏమీ కోరికల్లేవు అని సోనుసూద్ పేర్కొన్నారు.

    కామన్ మ్యాన్‌గానే హ్యాపీ

    కామన్ మ్యాన్‌గానే హ్యాపీ

    మీడియాతో మాట్లాడుతూ సోనుసూద్ మరింత వివరణ ఇచ్చారు. కామన్ మ్యాన్‌గా నేను చేస్తున్న సేవ నాకు చాలా సంతృప్తికరంగా ఉంది. సమాజంలో నా బాధ్యతను నేను సంపూర్ణంగా పూర్తి చేస్తున్నాను. జీవితంలో అంతకంటే ఏం కావాలి అంటూ సోనుసూద్ పేర్కొన్నారు.

    Recommended Video

    Sonu Sood To Import Oxygen Plant From France | ఇంకో పది రోజుల్లో వస్తుంది || Filmibeat Telugu
    ఫోటో జర్నలిస్టులకు జ్యూస్

    ఫోటో జర్నలిస్టులకు జ్యూస్

    ఇక తనతో మాట్లాడటానికి వచ్చిన ఫోటో జర్నలిస్టులను సోనుసూద్ సాదారంగా ఆహ్వానించారు. అనంతరం వారితో తన భావాలను, అభిప్రాయాలను పంచుకొన్నారు. అనంతరం ఫోటో జర్నలిస్టులకు స్టిల్స్ ఇచ్చారు. అనంతరం వారికి ఇమ్యునిటీ పెంచే జ్యూస్‌ను అందించారు. ఈ ఫోటోలు మీడియాలో వైరల్‌గా మారాయి.

    English summary
    Actor Sonu Sood is serving for Covid patients in many ways. He has been procuring oxygen cyllenders, Beds for Covid patients. In this occassion, Photo Journalist asked that Are you racing for Prime Minister Post: people wishing to see him running for PM in the next general election
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X