Sonu Sood's Fathers day Gift: కుమారుడికి కళ్లుచెదిరేలా ఖరీదైన గిఫ్ట్.. రూ. 2.5 కోట్లతో..
ప్రజలందరూ విపత్కర పరిస్థితుల్లో కూరుకుపోయి సహాయం కోసం ఎదురు చూస్తున్న సమయంలో సమాజ సేవతో ముందుకు కదిలిన సోను సూద్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కరుస్తున్నది. ఓ వైపు బాధితులందరినీ కుటుంబ సభ్యులుగా మార్చుకొని విశేషమైన సేవ చేస్తున్న సోనుసూద్ తన కుమారుడికి అరుదైన బహుమతిని అందించారు. జూన్ 20వ తేదీన వరల్డ్స్ ఫాదర్స్ డేను పురస్కరించుకొని కుమారుడు ఇషాంత్ సూద్‌కుమెర్సిడెజ్ బెంజ్- మేబాచ్ జీఎల్ఎస్ 600 మోడల్ కారును బహుకరించారు. ఈ కారు విలువ అక్షరాల రూ.2.5 కోట్లు.

సరికొత్త మెర్సిడెజ్ బెంజ్ కారు
తన కుమారుడు ఇషాంత్ కోసం కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చిన మెర్సిడెజ్ బెంజ్ కారుకు సంబంధించిన వీడియో య్యూట్యూబ్‌లో వైరల్‌గా మారింది. తన ఇంటికి తీసుకొచ్చిన కొత్త కారును కుటుంబ సభ్యులతో ట్రయల్ రన్‌కు వెళ్లడం వీడియోలో కనిపించింది. సోను సొంతం చేసుకొన్న ఈ వాహనం బ్లాక్ కలర్‌లో ఆకర్షణీయంగా కనిపించింది.

సోను సూద్ చేతిలో మిలమిలా మెరిసిన నల్లటి కారు
ఇక మెర్సిడెజ్ మెంజ్ కారు విషయానికి వస్తే.... గతవారమే ఈ వాహనం మార్కెట్లోకి వచ్చింది. కారు షోరూంలో వాహనం డెలివరీ.. ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దానిని సోనుసూద్ పరిశీలిస్తూ కనిపించారు. నల్లటి రంగులో ఈ వాహనం మిలమిలా మెరిపోతూ అందర్నీ ఆకర్షించింది.

మెర్సిడెజ్ బెంజ్ కారు ప్రత్యేకతలు
తాజా మెర్సిడెజ్ బెంజ్ Maybach GLS600 వాహనం ప్రత్యేకతలు ఏమిటంటే... కారు వెనుక భాగంలో 1103 మిల్లీమీటర్ల వైశాల్యంతో పొందికగా కూర్చొనేందుకు కావాల్సిన ప్రదేశం ఉంది. ముందు భాగంలో 1340 మిల్లీమీటర్ల మేర ప్రదేశాన్ని ఏర్పాటు చేశారు. 525 లీటర్ల లగేజ్ కెపాసిటీ, 12.3 డిజిటల్ ఇన్స్‌ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం లాంటి వసతులు ఉన్నాయి. కారు స్టార్ట్ అయిన 5 సెకన్లలోపే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకొనే కెపాసిటీ ఈ కారు ప్రత్యేకత.
సోను సూద్ గ్యారేజ్‌లో విలాసవంతమైన కార్లు
మెర్సిడెజ్ బెంజ్ లాంటి కార్లు సోను సూద్ గ్యారేజ్‌లో చాలానే ఉన్నాయి. ఖరీదైన వాహనాలు అంటే ఆయనకు చాలా ఇష్టం. ఇప్పటికే ఆడీ క్యూ7, మెర్సిడెజ్ బెంజ్ ఎంఎల్ క్లాస్, పోర్చే పానామెరా లాంటి కార్లు సోనుసూద్‌కు ఉన్నాయి. తాజాగా మెర్సిడెజ్ Maybach GLS600 ఆయన వాహనాల ఖాతాలో చేరింది.
Recommended Video

సోను సూద్ కెరీర్
సోను సూద్ కెరీర్ విషయానికి వస్తే... బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన అల్లుడు అదుర్స్ చిత్రంలో ఆయన నటించారు. ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య సినిమాలోను, హిందీలో పృథ్వీరాజ్, తమిళంలో తమిళ్ రాసన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇంకా పలు చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











