Don't Miss!
- News AP Elections: ముగిసిన నామినేషన్ల పర్వం- జగన్, బాబు, పవన్ కు పోటీ ఇలా..!
- Sports T20 World Cup 2024: సంజూ శాంసన్‌కు మళ్లీ అన్యాయమే!
- Technology వన్‌ప్లస్ 13 స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. 6.8 అంగుళాల డిస్ప్లే, 50MP కెమెరా సహా.. పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
Sonu Sood Super Market.. సైకిల్‌పై వ్యాపారం.. ఏం అమ్ముతున్నారో తెలుసా?
కరోనా కష్ట సమయంలోను, లాక్డౌన్, కర్ఫ్యూ లాంటి పరిస్థితుల్లో సమాజ సేవకు శ్రీకారం చుట్టిన నటుడు సోనుసూద్ ఎంతో మందిని అన్ని రకాలుగా ఆదుకొన్నారు. ఆర్థికంగా, వైద్యపరంగా, వలసదారులను తమ ఊరికి చేర్చడం లాంటి ఎన్నో పనులు చేసి దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకొన్నారు. ఇలా అందర్నీ హృదయంలో చోటు సంపాదించుకొంటున్న ఆయన సోను సూద్ సూపర్ మార్కెట్ తెరిచారు. ఆ మార్కెట్ వెనుక అసలు విషయం ఏమిటంటే...
సోను సూద్ వీడియో వైరల్
సోనుసూద్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేయగా వైరల్ అయింది. సైకిల్‌పై కూర్చొని దానికి తగిలించి ఉన్న వస్తువుల గురించి చెబుతూ కస్టమర్లకు సమాచారం అందించారు. షాపింగ్ మాల్స్ బంద్ అయ్యారని ఎవరన్నారు? మీ కోసం ఖరీదైన సూపర్ మార్కెట్ రెడీగా ఉంది. నా వద్ద అన్ని రకాల వస్తువులు లభిస్తాయి అంటూ తన సైకిల్‌పై ఉన్న సూపర్ మార్కెట్ గురించి వివరించాడు.
సోను సూద్ సూపర్ మార్కెట్లో..
తన సూపర్ మార్కెట్లో గుడ్లు ఉన్నాయి. ఒక్కొక్కటి 6 రూపాయలు. అలాగే నా వద్ద బ్రెడ్ ఉంది. పెద్దసైజు బ్రెడ్ రూ.40 రూపాయలు, చిన్న సైజు బ్రెడ్ ప్యాకెట్ 22 రూపాయలు. అంతేకాకుండా నా వద్ద పావ్, రస్క్, మరమురాలు, చిప్స్ లాంటి చాలానే ఉన్నాయి అంటూ తన సైకిల్ వేలాడదీసిన సంచులను చూపిస్తూ సోనుసూద్ తన సూపర్ మార్కెట్ గురించి వివరించాడు.
10 గుడ్లకు ఒక బ్రెడ్ ఫ్రీ
తన సూపర్ మార్కెట్‌కు హిట్ అని పేరు పెట్టారు. ప్రతీ 10 గుడ్లకు ఒక బ్రెడ్ ఫ్రీ. కాకపోతే డెలివరీ చార్జీలు అదనంగా ఉంటాయి. కస్టమర్లు త్వరగా తొందరపడి ఆర్డర్ చేయండి. సరుకు ఉన్నంత వరకే ఆర్డర్లకు వస్తువులు పంపిస్తాం అంటూ సోనుసూద్ తన సూపర్ మార్కెట్ అమ్మకాల గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు
మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా
సోను సూద్ సూపర్ మార్కెట్ వీడియోపై పలు రకాల కామెంట్లను అభిమానులు పెడుతున్నారు. ప్రజలకు సేవ చేస్తున్న మీకు.. మీ కుటుంబానికి అన్ని రకాల శుభం కలుగాలి అంటూ సోనుసూద్‌పై ప్రశంసలు గుప్పించారు. మిమ్మల్ని చూస్తుంటే గర్వంగా ఉంది. మీ ముఖంలో చెదరని నవ్వు ఉండాలి అంటూ నెటిజన్ల కామెంట్లు చేస్తున్నారు.
సోనుసూద్ సినీ కెరీర్ ఇలా
సోను సూద్ విషయానికి వస్తే.. సూద్ చారిటీ ఫౌండేషన్‌తో సేవ చేస్తూనే సినిమాలతో బిజీగా ఉన్నారు. హిందీలో చంద్రప్రకాశ్ ద్వివేది దర్శకత్వంలో వస్తున్న పృథ్వీరాజ్ చిత్రంతోపాటు తెలుగులో చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రంలో కీలక పాత్రను పోషిస్తాను. లాక్డౌన్ తర్వాత రిలీజైన బెల్లంకొండ శ్రీను నటించిన చిత్రంలో ప్రధాన పాత్ర పోషించారు.