twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోనుసూద్‌ను దేవుడ్ని చేసిన వలస కార్మికులు.. నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేసి..

    |

    కరోనావైరస్ కారణంగా విధించిన లాక్‌డౌన్ కాలంలో వలస కార్మికుల కష్టాలను తన కష్టాలుగా భావించిన బాలీవుడ్ నటుడు సోనుసూద్ దేశవ్యాప్తంగా ఎంతో మందిని ఆదుకొన్నారు. ముంబైతోపాటు పలు నగరాలు, పలు దేశాల్లో ఉన్న వలస కార్మికులను తమ సొంత ఊళ్లకు చేర్చిన విషయం అందరికి తెలిసిందే. లాక్‌డౌన్‌లో ప్రతీకూల పరిస్థితులను ఎదురించిన సోనుసూద్ ఇప్పుడు ప్రజలకు దేవుడిగా మారారు. ఆయన సేవలకు అరుదైన గౌరవాన్ని అందిస్తున్నారు. తాజాగా సోనూసూద్‌కు దక్కిన గౌరవం ఇదే..

    వలస కార్మికులకు దేవుడిలా

    వలస కార్మికులకు దేవుడిలా

    కరోనావైరస్‌తో దేశవ్యాప్తంగా కల్లోలం సృష్టించిన నేపథ్యంలో ఆపన్న హస్తం కోసం ఎదురుచూసిన వలస కార్మికులకు బాలీవుడ్ నటుడు సోనుసూద్ దేవుడిలా మారిపోయారు. సెలబ్రిటీలందరూ ఇంటికే పరిమితమై వంటలు వండుతూ, బట్టలు ఉతుకుతూ ఉన్న సమయంలో ప్రతికూల పరిస్థితులను ఎదురించి సొంత ఖర్చుతో వలస కార్మికులకు అండగా నిలిచారు.

    దుర్గ పూజ మండపాల్లో సోనుసూద్ విగ్రహాలు

    దుర్గ పూజ మండపాల్లో సోనుసూద్ విగ్రహాలు

    వలస కార్మికులపై చూపిన ఔదార్యం, ప్రేమతో సోనుసూద్‌పై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిసింది. విజయదశమి పండుగ సమయంలో పశ్చిమ బెంగాల్‌లో దుర్గా పూజలు నిర్వహించే మండపాల్లో సోనుసూద్ నిలువెత్తు విగ్రహాలను నెలకొల్పారు. దేవతలతోపాటు సోనుసూద్‌కు పూజలు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకొంటున్నారు.

    కోల్‌కత్తాలోని దుర్గామాత మండపంలో

    కోల్‌కత్తాలోని దుర్గామాత మండపంలో

    కోల్‌కత్తాలోని ది కెస్టోపూర్ ప్రఫుల్లా కనన్ క్లబ్‌కు చెందిన సభ్యులు సోనుసూద్ నిలువెత్తు విగ్రహాన్ని దుర్గమాత మండపంలో ప్రతిష్టించారు. లాక్‌డౌన్ సమయంలో ముంబై నుంచి ఢిల్లీకి బస్సు సదుపాయాన్ని ఏర్పాటు చేసినందుకు గుర్తుగా సోనుసూద్ పక్కనే బస్సు బొమ్మను కూడా ప్రతిష్టించారు.

    Recommended Video

    Sonu Sood's Old Mumbai Local Pass Goes Viral
    సోనుసూద్ సేవలను ఎలా మరిచిపోతాం

    సోనుసూద్ సేవలను ఎలా మరిచిపోతాం

    లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికుల గురించిన సంఘటనలు హృదయాన్ని కదిలించాయి. వలస కార్మికులు లేని దేశాన్ని ఊహించుకోలేం. అలాంటి విపత్కర పరిస్థితుల్లో సోను సూద్ చేసిన గొప్ప కార్యాన్ని ఎలా మరిచిపోతాం. అందుకే సోనుసూద్ సేవలను గుర్తుంచుకొనేలా ఆయన నిలువెత్తు విగ్రహాన్ని మండపంలో ఏర్పాటు చేశాం అని ఓ భక్తుడు పేర్కొన్నారు.

    English summary
    Bollywood actor Sonu Sood's life size statue appeared at Durga Puja Pandals in kolkata. Many migrant labours recollected his services in Nation wide lockdown amid Coronavirus.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X