రజనీకాంత్ కూతురికి మరో బిగ్ డైరెక్షన్ ఛాన్స్.. సీనియర్ క్రికెటర్ బయోపిక్?
ఇండియన్ క్రికెట్ టీమ్ కి కెప్టెన్ గా సుదీర్ఘకాలం పని చేసి ఎన్నో మరుపురాని విజయాల్ని అందించిన స్టార్ బ్యాటర్ సౌరబ్ గంగూలీ. గంగూలీ అంటే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో కచ్చితంగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని తీరాల్సిందే. వరల్డ్ కప్ లో ఇండియాని ఫైనల్ కి తీసుకెళ్లడంలో ద్వారా గంగూలీ కెప్టెన్ గా అరుదైన ఘనత సాధించారు.
ఇక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్ పై సాధించిన మరుపురాని విజయం ఇప్పటికి అందరికి గుర్తుండిపోతుంది. గ్యాలరీలో కూర్చొని షర్ట్ విప్పి గంగూలీ చేసిన హడావిడి ఇప్పటికి సెన్సేషన్ అని చెప్పాలి. గంగూలీ కెప్టెన్ అయ్యాక ఇండియన్ క్రికెట్ టీమ్ లో వేగం పెరిగింది. ప్రత్యర్ధుల మీద ఆటతో పాటు మాటతో కూడా దూకుడు పెరిగింది.

అతని సృష్టించిన ఒక ట్రెండ్ ని ఇప్పటికి ఇండియన్ క్రికెట్ టీమ్ కొనసాగిస్తోంది. ఆటగాడి నుంచి బీసీసీఐ ప్రెసిడెంట్ స్థాయి వరకు అతను ఎదిగాడు. అలాంటి గంగూలీ జీవిత కథతో ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా ప్లానింగ్ జరుగుతోంది. ముందుగా రణబీర్ కపూర్ తో ఈ సినిమా అనుకున్న ఆయన డేట్స్ ఖాళీ లేకపోవడంతో ఆ స్థానంలోకి ఆయుష్మాన్ ఖురానా వచ్చి చేరాడు.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ దర్శకత్వం బాద్యతలని సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్యకి అప్పగించాలని భావిస్తున్నారంట. ఇప్పటికే ఆమెతో నిర్మాతలు చర్చలు జరిపినట్లు టాక్. ప్రస్తుతం ఆమె లాల్ సలామ్ అనే మూవీని క్రికెట్ బ్యాక్ డ్రాప్ లోనే చేస్తోంది. ఈ సినిమాలో రజినీకాంత్ క్యామియో రోల్ చేశారు. ఈ మూవీ అవుట్ పుట్ భాగా రావడంతో గంగూనీ బాద్యతలు ఆమెకి అప్పగించాలని అనుకున్నారంట.
అయితే ఐశ్వర్య అయితే ఇంకా ఒకే చెప్పలేదని టాక్. లాల్ సలామ్ రిలీజ్ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తానని క్లారిటీ ఇచ్చిందంట. అయితే ఆమె కోసం నిర్మాతలు వెయిట్ చేయడానికి రెడీగా ఉన్నట్లు టాక్. ఒక వేళ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయితే ఆయుష్మాన్ ఖురానా కూడా గంగూలీ స్టైల్ లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











