ఒకప్పుడు స్టార్ హీరోగా మెరిసిన ప్రేమదేశం 'అబ్బాస్'.. ఇప్పుడు మాత్రం చిన్న ఉద్యోగం చేసుకుంటూ..
సినిమా ప్రపంచంలో కొందరు నటీనటులు ఎంట్రీ ఇచ్చిన మొదట్లోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంటారు. కొన్నిసార్లు వారికి వచ్చే రెస్పాన్స్ కు ఈజీగా అగ్ర నటీనటులుగా కొనసాగడం కాయమని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక అదే తరహాలో కామెంట్స్ అందుకున్న నటీనటులలో అబ్బాస్ ఒకరు. 90లలో ప్రభాస్ కు దక్కిన క్రేజ్ అంతా ఇంతా కాదు. అయితే ఈ స్టార్ యాక్టర్ గత కొన్నేళ్లుగా సినిమాల్లో కనిపించడం లేదు. దీంతో అతను ఎక్కడ ? ఎలా ఉన్నాడు అనే కామెంట్స్ చాలానే వస్తున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఆ ఒక్క సినిమాతోనే..
అబ్బాస్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది మాత్రం ప్రేమదేశం సినిమాతోనే. అది తమిళ్ సినిమా అయినప్పటికీ తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయగా దాదాపు ఇక్కడి స్టార్ హీరోల రేంజ్ లో బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. ఆ హిట్టుతో అబ్బాస్ కెరీర్ అటు తమిళ్ లోను ఇటు తెలుగులోను ఒక్కసారిగా ఊపందుకుంది.

ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్
అబ్బాస్ అందానికి అప్పట్లో అమ్మాయిలు ఎగబడిపోయేవారు. అబ్బాస్ సినిమా వచ్చింది అంటే అప్పట్లో థియేటర్స్ వద్ద అమ్మాయిలా క్యూ చాలా పెద్దగా ఉండేది. ఇక ఎలాంటి వేడుకలకు వెళ్లినా కూడా అబ్బాస్ ను అమ్మాయిలు మొత్తం చుట్టూ ముట్టేవారు. ఆ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న అబ్బాస్ గత ఆరేళ్లుగా ఇండస్ట్రీలో కనిపించడం లేదు.

అబ్బాస్ హెయిర్ స్టైల్.. ట్రెండ్ సెట్టర్
వెస్ట్ బెంగాల్ లో జన్మించిన అబ్బాస్ అనుకోకుండా ఒక స్నేహితుడి ద్వారా సినిమాల్లోకి వచ్చాడు. కేవలం తమిళ్ లోనే కాకుండా తెలుగులో కుడా మంచి మంచి సినిమాలు చేశాడు. అప్పట్లో అబ్బాస్ హెయిర్ స్టైల్ కూడా ఒక ట్రెండ్ సెట్ చేసింది. అబ్బాస్ కటింగ్ అంటూ ఇప్పటికి మాట్లాడుకుంటూ ఉంటారు.
హీరోగా చేస్తూనే రాజా వంటి సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ తో ఎంతగానో మెప్పించారు.
Recommended Video

ఎప్పుడు ఏం చేస్తున్నాడంటే..
ఇక అవకాశాలు తగ్గడంతో 2015 వరకు ఇండస్ట్రీలో ఉన్న అబ్బాస్ అనంతరం న్యూజిలాండ్ వెళ్లిపోయాడు. అక్కడే భార్యతో ఉంటూ ఒక ఉద్యోగం కూడా చేస్తున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా జాబ్ చేస్తూ అక్కడే హ్యాపీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక బైక్ రైడ్ కూడా ఈ హీరోకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.


Click it and Unblock the Notifications











