నార్త్ లో ఏకంగా 70 కోట్లు పెట్టి బంగ్లా కొన్న ఆ సౌత్ స్టార్ ఎవరు?

ప్రస్తుతం సౌత్, నార్త్ సినిమా అని భేదాలు లేకుండా మొత్తం ఒకటే ఇండియన్ సినిమా అన్నట్టుగా మారిపోయిన సంగతి తెలిసిందే. దీనితో అన్ని సినిమాల ఇండస్ట్రీస్ కి చెందిన హీరోలు తమ స్పాన్ ని పెంచుకునే విధంగా పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నారు. దాదాపు హిందీ సహా తెలుగు, తమిళ్ కన్నడ మళయాళ హీరోలలో బిగ్ స్టార్స్ అంతా పాన్ ఇండియా రీచ్ పైనే కన్నేశారు.

అయితే ఇది అంత తొందరగా సాధ్యమయ్యే పని కూడా కాదు. ఎప్పుడు నుంచో సినిమాలు రిలీజ్ చేస్తున్నప్పటికీ చాలా మందికి పాన్ ఇండియా సక్సెస్ దొరకడం లేని పరిస్థితి. ఇంకా చెప్పాలంటే చాలా సినిమాలు పాన్ ఇండియా భాషల్లో అనౌన్స్ అయ్యి లాస్ట్ కి వారి ఒరిజినల్ భాషల్లో మాత్రమే విడుదలతో ఆగిపోతున్నాయి. అయితే అన్ని భాషలు ఆడియెన్స్ ని అలరించాలి అంటే అక్కడి ఆడియెన్స్ కి కూడా దగ్గరగా ఉండడం అనేది చాలా ఉత్తమం.

south star hero bought a costly bungalow in north which worth 70cr who is that hero

కాగా ఇలా చాలా మంది హీరోలు కానీ హీరోయిన్స్ కానీ ఒక ఇండస్ట్రీలో మంచి ఫేమ్ వస్తే అక్కడే ఇల్లులు కొనడం లేదా స్థలాలు కొనడం వంటివి చేస్తూ ఉంటారు.. ఇలానే ఇప్పుడు మన సౌత్ ఇండియాకి చెందిన స్టార్ నటుడు నార్త్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 కోట్లు పెట్టి ఖరీదైన బంగ్లా కొన్నట్టుగా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆ హీరో మరెవరో కూడా కాదట తమిళ విలక్షణ నటుల్లో ఒకరైన సూర్య అట.

అవును సూర్యానే ఇప్పుడు ముంబై లో భారీ మొత్తం 70 కోట్లు పెట్టి బంగ్లా కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ గా సూర్య కంటే ముందే తన భార్య ప్రముఖ నటి జ్యోతిక బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ పలు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. నెక్స్ట్ సూర్య తన ప్రస్తుత భారీ చిత్రం "కంగువా" తో పాన్ ఇండియా లెవెల్ ఎంట్రీ గట్టిగా ఇచ్చే ప్లానింగ్ లో ఉన్నారు.

south star hero bought a costly bungalow in north which worth 70cr who is that hero

దీనితో ఇలా అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకునే సూర్య కుటుంబం కోసం అక్కడ మార్కెట్ కోసం కూడా దిగబోతున్నాడా అనిపించక మానదు. కాగా ఈ వార్తల్లో నిజమెంత ఉందో కానీ 70 కోట్ల బంగ్లా అంటే మాటలు కాదనే చెప్పాలి. సూర్య ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇంతలా ఆర్భాటానికి వెళ్తున్నాడా అనేది కూడా ఆలోచించేలానే ఉంది.

మరి ఈవార్తలో ఎంత నిజముందో వేచి చూడాలి. ఇప్పుడు సూర్య చేసిన భారీ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని హీరోయిన్ గా నటించగా బాలీవుడ్ రీసెంట్ సెన్సేషన్ నటుడు బాబీ డియోల్ కూడా నటిస్తున్నాడు. సో నార్త్ బెల్ట్ లో ఈ సినిమా వర్క్ అయ్యేందుకు ఛాన్స్ ఎక్కువే ఉంది. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు శివ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నాడు.

More from Filmibeat

Read more about: suriya kanguva disha patani
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X