మెగాస్టార్ బర్త్ డే స్పెషల్ సాంగ్.. అభిమానుల నుంచి చిరు కానుక!
మరికొన్ని రోజుల్లో మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే వస్తుండడంతో అభిమానుల్లో అప్పుడే ఒక స్పెషల్ జోష్ మొదలైంది. అభిమానుల ద్వారా అందరికి ఒక స్పెషల్ సర్ప్ రైజ్ కూడా అందనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో మెగాస్టార్ కి అడ్వాన్స్ బర్త్ డే విషెస్ ఒక రేంజ్ లో అందుతున్నాయి. ఈ నెల 22న చిరంజీవి 65వ పుట్టినరోజు జరుపుకోబోతున్నారు.
అసలు మ్యాటర్ లోకి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి ఓ స్పెషల్ సాంగ్ విడుదల చేయబోతోంది. వెంకటాద్రి టాకీస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, రాష్ట్ర రామ్ చరణ్ యువ శక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శివ చెర్రీ నిర్మించిన ఆ స్పెషల్ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందట.

మెగాస్టార్స్ మెగా ర్యాప్ పేరుతో విడుదల కానున్న ఆ సాంగ్ ను ఈ నెల 21న విడుదల చేయనున్నారు. ఇక పాటకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ను శనివారం సాయంత్రం ఏడు గంటలకు విడుదల చేశారు. ఇదివరకే రామ్ చరణ్ పుట్టినరోజు కోసం అభిమానులు విడుదల చేసిన సాంగ్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డే సాంగ్ కూడా అదే స్థాయిలో క్లిక్కవుతుందని చెబుతున్నారు.
ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పుట్టినరోజు సందర్భంగా సినిమాకు సంబంధించిన స్పెషల్ లుక్ ఏదైనా వస్తుందేమో అని అభిమానులు కొంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి దర్శకుడు కొరటాల ఎలాంటి సర్ ప్రైజ్ అందిస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











