ఆ హీరో సినిమా థియేటర్ లో 72 సార్లు చూసా: శ్రీ విష్ణు
సపోర్టింగ్ రోల్స్ చేసుకుంటూ కష్టపడి హీరోగా పైకొచ్చిన వారిలో శ్రీ విష్ణు ఒకరు. సినిమా సినిమాకు డిఫరెంట్ కంటెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకునే శ్రీ విష్ణు ఎలాంటి సినిమా చేసినా కూడా ఓ వర్గం ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంటాయి. మెంటల్ మదిలో, నీదీ నాదీ ఒకే కథ, వంటి వినూతమైన సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు మళ్లీ గాలి సంపత్ సినిమాతో కూడా అలాంటి క్రేజ్ అందుకోవాలని అనుకుంటున్నాడు.
అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ఈ హీరో ఆలీ సరదాగా ప్రోగ్రాంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టాడు. ఇష్టమైన సినిమాను థియేటర్ లోనే 72సార్లు చూశానని చెప్పాడు. ఆ సినిమా మరేదో కాదు. వెంకటేష్ - ఆర్తి అగర్వాల్ కాంబినేషన్ లో వచ్చిన నువ్వు నాకు నచ్చావ్. ఆ సినిమాలో వెంకటేష్ యాక్టింగ్ చాలా ఇష్టమని ఏ డైలాగ్ అయినా కూడా ఈజీగా చెప్పగలనని అన్నాడు.

ఇక ఇండస్ట్రీలోకి రావడానికి బాగా హెల్ప్ చేసింది నారా రోహిత్ అంటూ బాణం సినిమాలో మొదటి అవకాశం వచ్చిందని చెప్పాడు. ఇక రామ్ పోతినేని కూడా చాలా సందర్భాల్లో సహాయంగా ఉన్నారని శ్రీ విష్ణు వివరణ ఇచ్చారు. ఇక గాలి సంపత్ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











