బాలకృష్ణ బూతు డైలాగ్ ఇమిటేషన్.. ఫ్యాన్స్ ఫైర్.. హీరో ఏం చెప్పాడంటే?

నందమూరి నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్, గ్లోబల్ లయన్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో ఏళ్లుగా అదిరిపోయే ఎనర్జీతో సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ఇక బయట అభిమానులు, ఇతర మనుషులతో బాలకృష్ణ మెలిగే తీరు తెలిసిందే. ఫోన్ విసరగొట్టడాలు, బూతులు మాట్లాడటం వంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. అయితే ఇటీవల విడుదలైన ఓ సినిమా టీజర్ లో బాలకృష్ణ బూతు డైలాగ్ ఒకదాన్ని ఇమిటేట్ చేశాడు హీరో. దీంతో నందమూరి అభిమానులు ఫైర్ కాగా.. దానిపై క్లారిటీ ఇచ్చాడు.

సామజవరగమన అంటూ:టాలీవుడ్ ప్రామిసింగ్ హీరోల్లో శ్రీ విష్ణు ఒకరు. బాణం, సో, నా ఇష్టం, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ వంటి తదితర సినిమాల్లో చిన్న పాత్రలు చేసుకుంటూ వచ్చిన శ్రీవిష్ణు మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ సినిమాలతో హీరోగా మారాడు. ఇటీవల అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీవిష్ణు ఇప్పుడు సామజవరగమన మూవీతో బాక్సాఫీస్ వద్ద సందడి చేసేందుకు రెడీ అయ్యాడు.

నటీనటులు:ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించిన సామజవరగమన చిత్రంలో మలయాళీ ముద్దుగుమ్మ రెబ్బ మోనికా జాన్ హీరోయిన్ గా చేస్తుంది. అలాగే వెన్నెల కిశోర్, వీకే నరేష్, దేవి ప్రసాద్, రాజీవ్ కనకాల తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ద్రిష్టి, వివాహభోజనంబు సినిమాలకు దర్శకత్వం వహించిన రామ్ అబ్బరాజు సామజవరగమన చిత్రాన్ని తెరకెక్కించారు.

Sree Vishnu Clarity On Balakrishna Dialogue Imitation In Samajavaragamana Movie

అభిమానులు ఫైర్:సామజవరగమన సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్లకు మంచి స్పందన వచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా టీజర్ లో బాలకృష్ణ బూతు డైలాగ్ ను శ్రీవిష్ణు ఇమిటేట్ చేశాడు. ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయినా ఈ డైలాగ్ ఇమిటేషన్ పై నందమూరి అభిమానులు కాస్తంతా గుర్రుమన్నారు. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో శ్రీవిష్ణు ఓ క్లారిటీ ఇచ్చాడు.

Sree Vishnu Clarity On Balakrishna Dialogue Imitation In Samajavaragamana Movie

మంచి హైప్:"సినిమాలో బాలకృష్ణ వాయిస్ లాంటి డైలాగ్ కావాలని పెట్టలేదు. సీన్ కు తగినట్లుగానే ఆ డైలాగ్ పెట్టాం. హీరో బాగా చిరాకులో ఉన్నప్పుడు ఒక ఫోన్ వస్తుంది. అప్పుడు ఏదైనా ఫన్ జెనరేట్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్టర్ ఆ డైలాగ్ రాశారు. దాంతోనే టీజర్ కు మంచి హైప్ వచ్చింది" అని హీరో శ్రీవిష్ణు తెలిపాడు.

Sree Vishnu Clarity On Balakrishna Dialogue Imitation In Samajavaragamana Movie

ముందు చెప్పు గాడిద:ఇదిలా ఉంటే సామజవరగమన టీజర్ లో హీరో శ్రీవిష్ణుకి కాల్ వచ్చినప్పుడు "ఎవడ్రా ఎర్రిXX.. ఆ అది ముందు చెప్పు గాడిద" అంటూ బాలకృష్ణ స్టైల్ లో ఇమిటేట్ చేశాడు. ఇక గోపీ సుందర్ సంగీతం, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందించిన సామజవరగమన సినిమా జూన్ 29న అంటే గురువారం థియేటర్లలో సందడి చేయనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X