For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఉత్త చేతితో ఇండస్ట్రీకి వచ్చా.. బన్నీ సలహాతో ఈ రేంజ్‌కు.. అల్లు అర్జున్‌కు టన్నుల కొద్ది ధైర్యం.. శ్రీవిష్ణు

  |

  తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన అల్లు అర్జున్ ఆర్మీకి ధన్యవాదాలు. అల్లూరి సినిమాను ఐదు సంవత్సరాల నుంచి ట్రావెల్ అవుతూ రిలీజ్ వరకు తీసుకొచ్చాం. అప్ కమింగ్ హీరో గురించి ఆగిన దర్శకుడు ప్రదీప్ వర్మకు రుణపడి ఉంటాను. ఈ సినిమా పోలీస్ స్టోరి. ఇప్పటి వరకు చాలా సినిమాలు పోలీసు కథలతో వచ్చాయి. చాలా చూశాం. 20 ఏళ్ల లైఫ్‌ను ఈ సినిమాలో చూపించబోతున్నాం. ఈ సినిమాలో జరిగిన సంఘటనలన్నీ వాస్తవాలే. అల్లూరి తప్పుకుండా చూడాల్సిన సినిమా. కరోనా సమయంలో పోలీసు వాళ్లు చేసిన సేవకు గుర్తింపుగా ఈ సినిమాను అంకితం ఇస్తున్నాం. ఈ సినిమా తప్పకుండా ప్రతీ ఒక్కరు చూడాలి అని హీరో శ్రీవిష్ణు ఎమోషనల్‌గా మాట్లాడుతూ..

  మా బన్నీ గురించి మాట్లాడాలి..

  మా బన్నీ గురించి మాట్లాడాలి..


  శ్రీ విష్ణు గురించి మాట్లాడుతూ.. మా బన్నీ గారి గురించి మాట్లాడాలి. నేను ఇండస్ట్రీకి రెండు ఖాళీ చేతులతో వచ్చాను. ఏం చేయాలో తెలియదు. షార్ట్ ఫిలింస్ చేసుకొంటున్న సమయంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్ పిలిచి ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో చిన్న పాత్రతో అవకాశం ఇచ్చారు. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత రేసుగుర్రం షూటింగు అవుతున్నది. ఆ షూటింగు నుంచి కాల్ వచ్చింది. అయితే నా ఫ్రెండ్స్ ఆటపట్టిస్తున్నారని అనుకొన్నాను. కానీ షూటింగుకు వెళితే.. అల్లు అర్జున్ పిలిచి పక్కనే కూర్చొపెట్టుకొన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన చెప్పిన మాటలే పాటిస్తాను అని ఉద్వేగానికి శ్రీవిష్ణు లోనయ్యారు.

  కామెడీ టైమింగ్ బాగుందని అంటూ

  కామెడీ టైమింగ్ బాగుందని అంటూ

  రేసుగుర్రం షూటింగులో నన్ను కూర్చోబెట్టుకొని.. శ్రీవిష్ణుగారు.. మీరు చాలా బాగా చేశారు. మీ కామెడీ టైమింగ్ బాగుంది. అయితే మీకు చాలా ఆఫర్లు వస్తున్నాయనుకొంటా. కానీ మీరు ఏది పడితే అది చేయకండి సలహా ఇచ్చారు. ఆఫర్లు వస్తే చేయవద్దని ఎందుకు అన్నారో అర్ధం కాలేదు. నీవు చేసే సినిమాలు బట్టే అలాంటి సినిమాలు వస్తాయి. ఇండస్ట్రీ మారుతున్నది. వచ్చే నాలుగేళ్లలో కంటెంట్ ఉన్న సినిమాలే ఆడుతాయి. కంటెంట్ ఉన్న సినిమాలే తీయి.. అవే ఆడుతాయి. మీకు నచ్చిన కథలు ఉంటే నా వద్దకు రా.. నేను స్వయంగా తీస్తాను అని అల్లు అర్జున్ చెప్పారు. ఆ మాటలే నాకు వేయి ఎనుగుల బలం అని శ్రీ విష్ణు చెప్పారు.
  నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని

  నా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయని


  అల్లు అర్జున్ నాకు చాలా సలహాలు ఇచ్చారు. ఇండస్ట్రీలో నీకు ఎవరు లేరని అనుకోకు. నీకు ఎలాంటి సమయంలోనైనా నా ఇంటి తలుపు కొట్టు. 24 గంటలు నీకు ఇంటి తలుపు తెరిచి ఉంటాయి. నీకు ఎలాంటి సహాయమైనా చేస్తాను. మాటలు చెప్పడం చాలా ఈజీ. మాటలు నిలబెట్టుకోవాలంటే దమ్ము ఉండాలి. అది మన బన్నీగారికి టన్నుల కొద్ది దమ్ము ఉంది. ఆ తర్వాత కంటెంట్ ఉన్న సినిమాలు పట్టుకొని నిర్మాతల చుట్టూ తిరిగితే అర్ధం కాలేదు. దాంతో నేను కంటెంట్ ఉన్న సినిమాలు తీసి ప్రూవ్ చేసుకోవాలని అనుకొన్నాను అని శ్రీ విష్ణు చెప్పారు

  అల్లూరి సినిమా ఎలా ఉంటుందంటే?

  అల్లూరి సినిమా ఎలా ఉంటుందంటే?


  ఇక అల్లూరి సినిమా విషయానికి వస్తే.. ఫస్టాఫ్ మూవీ సింగిల్ స్క్రీన్‌లో తగ్గేదేలే అంటుంది. సెకండాఫ్‌లో మల్టీ ప్లెక్స్ ఆడియెన్స్‌ తగ్గేదేలే అంటారు. డిఫరెంట్ సినిమాలు చూసే వారు తగ్గదేలే అంటారు. చివరి 30 నిమిషాలు భారమైన గుండెతో బయటకు వస్తారు. సినిమా చూసిన తర్వాత పోలీస్ కనబడితే సెల్యూట్ చేయాలనిపించే విధంగా సినిమా ఉంటుంది అని శ్రీవిష్ణు ఎమోషనల్ అయ్యారు.

  అల్లు అర్జున్ చెప్పిన మాటలు

  అల్లు అర్జున్ చెప్పిన మాటలు


  రేసుగుర్రం సినిమా షూటింగులో ఆ రోజు అల్లు అర్జున్ చెప్పిన మాటలు గుర్తు పెట్టుకొని ఆచరిస్తున్నాను. నా ప్రతీ సినిమాలో AA అని థ్యాంక్స్ కార్డు వేస్తాను. ఈ సినిమాలో వేయలేదు. ఈ సినిమా ఫంక్షన్‌కు రమ్మని అడగ్గానే వచ్చినందుకు ధన్యవాదాలు. నా సినిమాలో పాత్ర పేర్లు కూడా A అక్షరంతో స్టార్ట్ అవుతాయి. అది నాకు ఆయన మీద ఉన్న అభిమానం అని శ్రీవిష్ణు చెప్పారు.

  English summary
  Icon Star Allu Arjun attended for Sree Vishnu's Alluri Pre Release Event. He speaks about Sree Vishnu emotionally.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X