నా జీవితాన్ని అలా మార్చినందుకు థాంక్స్.. ఆ లవ్ అన్ కండిషనల్.. శ్రీజ ఎమోషనల్ పోస్ట్
గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిన్న కుమార్తె శ్రీజ వార్తల్లో నిలుస్తోంది. ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో తన భర్త కళ్యాణ్ దేవ్ పేరు తొలగించడంతో వారి మధ్య ఏదో జరిగిందని, ఇంకేముంది వారి విడాకుల ప్రకటన కూడా వచ్చేస్తోందని రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. అయితే ఈ విషయం మీద ఇప్పటిదాకా ఎవరూ నోరు విప్పలేదు. కానీ అనూహ్యంగా ఇప్పుడు తన సోదరుడి గురించి స్పందించింది. ఆమె ఏమని స్పందించింది? అనే వివరాల్లోకి వెళితే

ముకుంద సినిమా ద్వారా
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 2014లో ముకుంద సినిమా ద్వారా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కెరీర్ తొలినాళ్లలో పెద్ద హిట్‌లు దక్కించుకోలేకపోయిన ఈ మెగాహీరో క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఫిదా సినిమా
ఆ తర్వాత వచ్చిన లోఫర్, మిస్టర్ సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోయాయి కానీ ఆ తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా వరుణ్ తేజ్‌కు విజయాన్ని అందించింది.
ఆ తర్వాత వచ్చిన తొలి ప్రేమ సినిమా కూడా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక అనిల్ రావుపుడి దర్శకత్వంలో వచ్చిన F2 సినిమా వరుణ్ తేజ్ కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా నిలిచింది. సీనియర్ హీరో వెంకటేశ్‌తో కలిసి వరుణ్ తేజ్ నటించిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
సోషల్ మీడియాలో శుభాకాంక్షలు
ఇప్పుడు అయన ఆ సినిమాకే సీక్వెల్ గా వస్తున్న F3 సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మార్చి నెలలో విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు. అలాగే ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు మెగా హీరోలు సహా పలువురు సినీ ప్రముఖులు, సామాన్యులు సైతం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.

శ్రీజ కూడా
తాజాగా వరుణ్ కి ఆయన అక్క, చిరు చిన్న కుమార్తె శ్రీజ కూడా శుభాకాంక్షలు చెప్పారు. ''పుట్టినరోజు శుభాకాంక్షలు తమ్ముడు. పొడవుగా ఉండడం వలన మీరు తెలివైనవారు కాదు, అందుకే నేను మీ కోసం ఇక్కడ ఉన్నాను అంటూ సరదాగా వ్యంగ్యం ఆడారు ఆమె. అంతే కాక నా బాల్యాన్ని ఉత్తేజపరిచినందుకు మరియు బేషరతుగా నా పట్ల మీ మద్దతు మరియు ప్రేమను అందించినందుకు ధన్యవాదాలు. నేను చెప్పగలిగే దానికంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. తమ్ముడూ అంటూ ఆమె వెల్లడించింది.

స్పందించలేదు కానీ
ఇక గత కొద్ది రోజులుగా కల్యాణ్ దేవ్, శ్రీజ మధ్య విభేదాలు ఉన్నాయని, వారిద్దరు విడిపోతున్నారనే వార్త మీడియాలో హల్ చేస్తున్నది. శ్రీజను వివాహం చేసుకున్న తరువాత కళ్యాణ్ దేవ్ విజేత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన రెండో సినిమా సూపర్ మచ్చి మొన్న సంక్రాంతికి విడుదలైంది కానీ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ ప్రమోషన్స్ చేయక పోవడంతో ఈ విషయం మీద మరింత చర్చ జరిగింది. ఇలాంటి క్రమంలో శ్రీజ ఇన్స్‌టాగ్రామ్‌లో స్పందించలేదు. కానీ తన సోదరుడి బర్త్ డే పై ప్రేమగా స్పందించింది.


Click it and Unblock the Notifications











