For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  జూ ఎన్టీఆర్ హెల్ప్ చేయలేదు, అదంతా తప్పుడు ప్రచారం: శ్రీహరి తనయుడు మేఘాంశ్

  |
  Srihari Son Meghamsh About Jr NTR || Filmibeat Telugu

  దివంగత నటుడు, రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి తనయుడు మేఘాంశ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'రాజ్‌దూత్'. లక్ష్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సత్తి బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి కార్తీక్, అర్జున్ అనే ఇద్దరు యంగ్ డైరెక్టర్స్ దర్శకత్వం వహిస్తున్నారు.

  సినిమా ప్రమోషన్లో భాగంగా మేఘాంశ్ ఓ ఛానల్ ఇంటర్వూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన తండ్రి గురించి, 'రాజ్‌దూత్' సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నాన్న మొదట్లో విలన్ పాత్రలు చేసి తర్వాత హీరో అయ్యారు. ఆయన అంత కష్టపడ్డారు కాబట్టే మాకు నేరుగా హీరోగా చేసే అవకాశం దక్కిందని తెలిపారు.

  నాన్న పేరు నిలబెట్టడమే లక్ష్యం

  నాన్న పేరు నిలబెట్టడమే లక్ష్యం

  మేము ఏం చేసిన నాన్న పేరు నిలబడే విధంగా చేయాలి, ఎక్కడ కూడా ఆయన పేరు తగ్గకుండా చూడాలి.. అదొక్కటి రీచ్ అయితే చాలు అనుకుంటున్నాం. డాడీ ఇపుడు ఉంటే ఇంకా బావుండేది. ప్రతి షాట్ దగ్గరుండి చూసేవారు. ఏది ఎలా చేయాలని సూచనలు ఇచ్చేవారు. ఆయన్ను చాలా మిస్సవుతున్నాం... అంటూ మేఘాంశ్ ఎమోషనల్ అయ్యారు.

  చిన్నోడిని హీరో చేయాలి... పెద్దోడిని డైరెక్టర్ చేయాలనేవారు

  చిన్నోడిని హీరో చేయాలి... పెద్దోడిని డైరెక్టర్ చేయాలనేవారు

  డాడీకి మేము ఇద్దరం సినిమాల్లోకి రావాలని ఉండేది, చిన్నోడిని హీరో చేయాలి... పెద్దోడిని డైరెక్షన్ డిపార్టుమెంటులోకి తీసుకెళ్లాలనేవారు. మమ్మీకి మాత్రం మేము బాగా చదువుకోవాలని ఆశ. డాడీ కోరిక మేరకు ఇద్దరూ ఈ రంగంలోనే కొనసాగుతున్నామని తెలిపారు.

  డాడీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ

  డాడీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ

  డాడీ ఎంత బిజీగా ఉన్నప్పటికీ రోజూ మమ్మల్ని కూర్చోబెట్టి అన్ని విషయాలు మాట్లాడేవారు. మా అన్నయ్య ఇపుడు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాడు. తను కూడా డైరెక్షన్లోకి రావాలనుకుంటున్నాడు. ‘రాజ్‌దూత్' సినిమా మొదలవ్వడానికి ముందు ఒక నెల రోజులు యాక్టింగులో శిక్షణ తీసుకున్నాను. డాన్స్ అనేది చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాను. బాక్సింగ్ క్లాసులకు వెళ్లేవాడిని. అలా చిన్నప్పటి నుంచి సినిమాల మీద ఆసక్తి పెంచుకుంటూ పెరిగినట్లు మేఘాంశ్ తెలిపారు.

  ‘రాజ్‌దూత్' కథకు స్పూర్తి అదే..

  ‘రాజ్‌దూత్' కథకు స్పూర్తి అదే..

  ‘రాజ్ దూత్' అనే బైక్ చుట్టూ సినిమా తిరుగుతుంది. రాజస్థాన్‌లో బైక్ కోసం గుడి కట్టారంట. దాన్ని స్పూర్తిగా తీసుకుని మా డైరెక్టర్ ‘రాజ్‌దూత్' కథ రాశాడు. మా సినిమాలో కూడా అలాంటి సన్నివేశమే ఉంటుంది. ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉందని మేఘాంశ్ చెప్పుకొచ్చారు.

  అపుడు టఫ్ టైమ్ ఫేస్ చేశాం

  అపుడు టఫ్ టైమ్ ఫేస్ చేశాం

  నాన్న చనిపోయిన తర్వాత కొంత టఫ్ టైమ్ ఫేస్ చేశాం. ఆ సమయంలో మా మామయ్యలు ఇద్దరూ చాలా సపోర్ట్ చేశారు. రెండు మూడు సంవత్సరాలు హైదరాబాద్ లోనే ఉండి అన్నీ చూసుకున్నారు. డాడీ సైడ్ నుంచి బాబాయ్, పెద్దనాన్నలు సపోర్టివ్‌గా ఉన్నారని తెలిపారు.

  జూ ఎన్టీఆర్ హెల్ప్ చేయలేదు

  జూ ఎన్టీఆర్ హెల్ప్ చేయలేదు

  జూ ఎన్టీర్ నాకు హెల్ఫ్ చేశాడని... ఈ విషయం ‘రాజ్‌దూత్' ఆడియో ఫంక్షన్లో నేను చెప్పినట్లు మీడియాలో వార్తలు రాశారు. నేను ఆ విషయం అసలు చెప్పలేదు. అలా ఎందుకు రాశారో తెలియదు. నా ఫేవరెట్ యాక్టర్లలో జూ ఎన్టీఆర్ కూడా ఒకరు... అని మేఘాంశ్ తెలిపారు.

  English summary
  Srihari Son Meghamsh about Jr NTR. Srihari Son Meghamsh debut with Rajdoot Movie. ‘Rajdoot’ the project is directed by Dasari Carthyk and Arjun, who happen to be renowned writers. The movie releasing next month.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X