నాని కోసం అద్భుతమైన కథ.. రెండేళ్ల గ్యాప్ తరువాత దర్శకుడు!
నేచురల్ స్టార్ నాని అటు బిగ్ బాస్, ఇటు సినిమాలతో తెగ బిజీగా గడిపేస్తున్నాడు. త్వరలో నాని, నాగార్జున కలసి నటించిన దేవదాస్ చిత్రం విడుదల కాబోతోంది. క్రికెట్ నేపథ్యంలో సాగే జెర్సీ చిత్రానికి నాని రెడీ అవుతున్నాడు. ఈ చిత్రానికి మళ్ళీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు.
ఇదిలా ఉందిగా నాని మరో క్రేజీ అవుతున్నాడు. కొత్తబంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తన ప్రతిభ ఏంటో నిరూపించుకున్నారు. సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కించిన బ్రహ్మోత్సవం చిత్రం నిరాశపరచడంతో శ్రీకాంత్ అడ్డాల నుంచి మరో చిత్రం రాలేదు.

రెండేళ్లు గ్యాప్ తీసుకున్న శ్రీకాంత్ అడ్డాల ఓ అద్భుతమైన కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నానికి ఈ చిత్ర కథ వినిపించడం జరిగిందట. నాని ఈ చిత్రంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. నాని ఒకే చెబితే వచ్చే ఏడాది ఈ చిత్రం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











