మహేష్ సూపర్ హిట్ సినిమా తరహాలో నాని మూవీ!
నేచురల్ స్టార్ నాని మళ్ళీ జోరు పెంచబోతున్నాడు. నాని నటించిన చివరి రెండు చిత్రాలు కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ నిరాశపరిచాయి. ఈ సారి విభిన్నమైన కథాంశంతో అలరించాలని జెర్సీ చిత్రంలో నటిస్తున్నాడు. జెర్సీ చిత్రం క్రికెట్ నేపథ్యంలో రూపొందబోతోంది. క్రికెటర్ గా నటించేందుకు నాని ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.
నాని మరో చిత్రాన్ని కూడా ప్రారంభించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఆకట్టుకునే దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల రూపొందించిన కథకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కాబోతుందనే వార్తలు వస్తున్నాయి.

ఈ చిత్రం గురించి మరో ఆసక్తికరమైన వార్త కూడా ప్రచారం జరుగుతోంది. మహేష్, వెంకీ సూపర్ హిట్ మల్టీస్టారర్ చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తరహాలో ఈ చిత్రం వుండబోతుందనే వార్తలు వస్తున్నాయి. నాని కోసం పల్లెటూరి నేపథ్యంలో శ్రీకాంత్ అడ్డాల అందమైన కథ రూపొందించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











