నిఖిల్‌కు దర్శకుడిగా శ్రీనివాస్ అవసరాల ?
యంగ్ హీరో నిఖిల్ విభిన్న చిత్రాలతో దూసుకుపోతున్నాడు. నిఖిల్ ప్రస్తుతం ముద్ర చిత్రంలో నటిస్తున్నాడు. మీడియా నేపథ్యంలో ఈ చిత్రం థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోంది. ఇదిలా ఉండగా నిఖిల్ కొత్త చిత్రానికి సంబంధించి ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.
నటుడిగా, రచయితగా, దర్శకుడిగా సత్తా చాటుతున్న మల్టి టాలెంటెడ్ పర్సన్ శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నిఖిల్ కొత్త చిత్రం తెరకెక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీనివాస్ అవసరాల గతంలో జ్యో అచ్యుతానంద, ఊహలు గుసగుసలాడే చిత్రాలతో దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకున్నాడు.

శ్రీనివాస్ అవసరాల, నిఖిల్ కాంబో ఒకే అయితే ఈ చిత్రాన్ని వారాహి బ్యానర్ లో సాయి కొర్రపాటి నిర్మించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముద్ర చిత్రం విడుదలైన తరువాత ఈ చిత్రానికి సంబందించిన కార్యక్రమాలు మొదలయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











