శ్రీను వైట్లకు హీరో దొరికాడు.. రిపీట్ కాబోతున్న 'ఢీ' కాంబినేషన్!
ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా ఉన్న శ్రీను వైట్ల ఇప్పుడు పూర్తిగా ఫామ్ కోల్పోయాడు. బాద్షా తర్వాత శ్రీనువైట్ల రూపొందించిన చిత్రాలన్నీ డిజాస్టర్స్ గా నిలిచాయి. దీనితో ఒక్క హిట్ చిత్రం కోసం శ్రీనువైట్ల ప్రయత్నిస్తున్నాడు. గత ఏడాది రవితేజ హీరోగా రూపొందించిన అమర్ అక్బర్ ఆంటోని చిత్రం కూడా తీవ్రంగా నిరాశపరిచింది. దీనితో శ్రీనువైట్లతో స్టార్ హీరోలు సినిమా చేసే పరిస్థితి లేదు. తదుపరి చిత్రంలో హీరో కోసం శ్రీనువైట్ల వెతుకుతున్నాడు.
శ్రీనువైట్ల తదుపరి చిత్రానికి హీరో దొరికినట్లు సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం ఢీ కాంబినేషన్ రిపీట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీనువైట్ల దర్శత్వంలో రెండవసారి నటించడానికి మంచు విష్ణు అంగీకరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబినేషన్ లో 2007లో వచ్చిన ఢీ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.

మంచు విష్ణుకు కూడా ఇటీవల సరైన విజయం లేదు. ఆచారి అమెరికా యాత్ర తర్వాత విష్ణు మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. ఢీ చిత్రంలో శ్రీనువైట్ల మార్క్ కామెడీ, మంచు విష్ణు టైమింగ్ తో అదిరిపోయింది. అలాంటి మ్యాజిక్ మళ్ళీ చేస్తారేమో చూడాలి. ఈ చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుంది, హీరోయిన్ ఎవరు అనే విషయాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











