మెగాస్టార్ చిరంజీవి స్టార్ హీరో కూతురు.. ఈ కాంబో సెట్టయితే కెమిస్ట్రీ అదుర్స్!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆరు పదుల వయసులో కూడా ఒకేసారి నాలుగైదు సినిమాలు లైన్ లో పెట్టారు. ఒక విధంగా నేటితరం యువ హీరోలు కంటే కూడా ఆయన చాలా వేగంగా సినిమాలను ఫినిష్ చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మెగాస్టార్ తన స్థాయిని ఒక్కసారిగా చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఈ తరహా లో ఎక్కువ సినిమాలను ఒకేసారి లైన్ లో పెట్టింది లేదు. అయితే ఈ సినిమాలను మెగాస్టార్ ఎంత స్పీడ్ గా రిలీజ్ చేస్తారని విషయంలో పెద్దగా అనుమానాలు లేవని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే ఆచార్య సినిమా పూర్తిగా ఫినిష్ అయింది. ఆ సినిమా ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయాలని ప్రణాళికలు రచిస్తున్న విషయం తెలిసిందే.

ఇక ఆ తర్వాత రాబోయే లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ షూటింగ్ కూడా సగానికి పైగానే పూర్తి అయ్యింది. ఆ సినిమా కూడా జనవరి నెల తుది దశకు చేరుకునే సమయానికి మొత్తం పూర్తవుతుంది అనే చెప్పాలి. ఆ సినిమాకు మోహన్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక అయితే బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి సినిమాలో ఎవరితో రొమాన్స్ చేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం మెగాస్టార్ కు హీరోయిన్స్ వెతకడం దర్శకులకు పెద్ద టాస్క్ గా మారింది అని చెప్పాలి. మెగాస్టార్ స్థాయికి తగ్గట్టుగా బ్యాలెన్స్ గా ఉండే హీరోయిన్స్ సంఖ్య కొంతవరకు తగ్గింది.

Sruthi hasan new project with Megastar chiranjeevi

కాజల్ తో రెండోసారి ఆచార్య సినిమాలో నటిస్తున్న మెగాస్టార్ తమన్నా తో మెహర్ రమేష్ బోళా శంకర్ సినిమాలో నటించనున్నారు. ఇక బాబీ డైరెక్షన్లో చేయబోయే సినిమాలో మెగాస్టార్ కు జోడిగా సీనియర్ హీరో కూతురు ని సెలెక్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు శృతి హాసన్ అని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక టాక్ అయితే నడుస్తోంది. ఇదివరకే మెగాహీరోల అందరితో కలిసి నటించిన శృతి హాసన్ ఇప్పుడు మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాడని రెడీ అవుతున్నట్లు టాక్. ఇక పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమాతో పాటు కాటమరాయుడు సినిమా చేసిన శృతిహాసన్ రామ్ చరణ్ తేజ్ తో కూడా ఎవడు సినిమా చేసింది.

ఇక అల్లు అర్జున్ సరైనోడు వంటి బాక్సాఫీస్ హిట్ సినిమాలో కూడా శృతి హాసన్ నటించింది. ల్ అందరు మెగా హీరోలతో నటించిన తర్వాత అసలైన మెగాస్టార్ చిరంజీవి తో కూడా శృతిహాసన్ నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాపై త్వరలోనే మరొక అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రాబోతునట్లు సమాచారం. అయితే మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సినిమాను నిర్మాత డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. అలాగే మారుతి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ కోసం గోపీచంద్ మలినేని వంటి మాస్ కమర్షియల్ దర్శకులు కూడా సినిమా చేసేందుకు లైన్ లో ఉన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X