రాజమౌళిని టెన్షన్ పెట్టిన చిరంజీవి.. ఓరి దేవుడో అంటూ తలపట్టుకొన్న జక్కన్న!
తెలుగు సినిమా చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. పాన్ ఇండియా కల్చర్‌ను పరిచయం చేసి బాలీవుడ్ పునాదులను కదిలించేలా బీజాలు వేశాడు. జక్కన్న వేసిన దారిలో ఇప్పుడు ఎన్నో సౌత్ సినిమాలు హిందీ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్నాయి. రాజమౌళీ కెరీర్‌లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది మగధీర గురించి. జక్కన్న సెల్యూలాయిడ్‌పై సృష్టించిన ఆవిష్కరించిన ఈ సినిమా రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా మేకింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై కీలక విషయాలు పంచుకున్నారు రాజమౌళి. ఆ వివరాల్లోకి వెళితే..
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్.. హీరోగా నిలదొక్కుకుంటున్న రోజులవి. చిరుతతో మంచి మార్కులు వేయించుకున్న చరణ్‌పై కొన్ని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అప్పటికే అపజయం అనేది లేకుండా వరుసగా ఆరు బ్లాక్‌బస్టర్లు కొట్టడంతో చిరంజీవి, చరణ్‌ను రాజమౌళి చేతిలో పెట్టారు. రాజమౌళి ఫస్ట్ టైమ్ చారిత్రక, జానపద నేపథ్యాల జోలికి వెళ్లారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ ఖర్చుకు వెనుకాడకుండా రిస్క్ చేసి దాదాపు రూ.44 కోట్ల బడ్జెట్‌తో మగధీరను నిర్మించారు. పునర్జన్మలు, ప్రేమ, ప్రతీకారం బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన మగధీరలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించగా.. శ్రీహరి, దేవ్ గిల్ కీలకపాత్రలు పోషించారు.

2009 జూలై 30న విడుదలైన మగధీర బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించి రూ.100 కోట్ల వసూళ్లు సాధించిన తొలి తెలుగు చిత్రంగా నిలిచింది. రెండు జాతీయ చలన చిత్ర పురస్కారాలు, ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 9 నంది పురస్కారాలను మగధీర కైవసం చేసుకుంది. మగధీరలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రామ్ చరణ్ డ్యాన్స్. ఆయనలోని డ్యాన్సింగ్ స్కిల్స్ ఈ మూవీలో పూర్తిగా బయటికొచ్చాయి. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని బిగ్గెర్ దెన్ బిగ్‌బీగా మార్చిన 'ఘరానా మొగుడు'లోని బంగారు కోడిపెట్ట సాంగ్‌ను మగధీర కోసం రీమిక్స్ చేశారు.
పాత ఒరిజినల్ సాంగ్‌కి చిరు వేసిన స్టెప్స్ అప్పట్లో ఒక ఊపు ఊపాయి. బాడీని స్ప్రింగ్‌లా తిప్పుతూ మెగాస్టార్ వేసిన స్టెప్స్‌ను ఎంతో మంది ట్రై చేశారు. అలాంటిది చరణ్ ఈ పాటను ఎలా చేస్తాడోనని ప్రేక్షకులు ఎగ్జయిటింగ్ ఫీల్ అయ్యారు. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రాఫి చేసిన స్టెప్స్‌ను చరణ్ అద్భుతంగా చేశాడు. టెక్నాలజీ సాయంతో నాడు చిరంజీవి వేసిన స్టెప్స్‌ను ఇందులో చూపించగా.. చరణ్ దానిని యాజిటిజ్‌గా చేసి ఔరా అనిపించుకున్నారు.
ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎస్ఎస్ రాజమౌళి.. బంగారు కోడిపెట్ట రీమేక్ చేయడానికి పడ్డ ఇబ్బందుల గురించి పంచుకున్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలోని మాస్ సాంగ్స్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాంగ్స్‌లో బంగారు కోడిపెట్ట ఒకటని, చిరంజీవిగారి అబ్బాయి కాబట్టి .. చరణ్ ఈ పాటను రీమేక్ చేస్తే జనం చూస్తారని అనుకున్నానని రాజమౌళి తెలిపారు. తీరా దిగిన తర్వాత ఆ పాట ఎంత వరకు సక్సెస్ అవుతామా లేదా.. తేడా వస్తే జనం ఏమంటారోనని భయపడ్డానని ఆయన చెప్పారు.
తాను పాత పాటిని కొన్ని వందల సార్లు చూశానని.. చిరంజీవి స్టెప్స్‌ని ఎంజాయ్ చేసినట్లు ఇంకెవరూ చేయలేరని జక్కన్న అన్నారు. ప్రేమ్ రక్షిత్ , చరణ్‌లు ఎంతో కష్టపడ్డారని.. రీమేక్ సాంగ్ వచ్చాక చిరంజీవి కంటే కష్టమైన స్టెప్స్‌ని చెర్రీ అద్భుతంగా చేశాడని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం రాజమౌళి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మెగా ఫ్యాన్స్ చరణ్‌కు కాంప్లిమెంట్ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











