అక్కడికి వెళ్లి అద్దె ఇంట్లో ఉంటున్న రాజమౌళి అండ్ టీమ్.. మహేష్ సినిమా కోసం అలా..

RRR సినిమా నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డును గెలుచుకున్న తర్వాత దర్శకుడు SS రాజమౌళి అతని బృందం యుఎస్ లో వారి స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నారు. ఈ వేడుకలు గ్రాండ్‌గా జరిగాయి. పార్టీలో అందరూ చాలా సంతోషంగా గడిపారు. ఏది ఏమైనప్పటికీ, రాజమౌళి ఈ మధ్య తరచుగా యుఎస్ కి వెళ్లడం కామన్ గా మారింది.

దర్శకుడు రాజమౌళి గత ఆరు నెలలుగా తరచుగా అమెరికాకి వెళుతున్నాడు. అక్కడే సినిమా గ్లోబల్ అవార్డ్స్ అలాగే ఆస్కార్ అవార్డ్స్ కోసం ప్రత్యేకంగా ప్రమోషన్ కూడా చేశారు. రాజమౌళి లాస్ ఏంజిల్స్‌లో కొన్ని రోజులు ఉండడం కోసం ప్రత్యేకంగా ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజమౌళి హాలీవుడ్ సహకారం గురించి చర్చిస్తున్నట్లు సమాచారం. అక్కడ ఇప్పటికే ఏజెంట్లు, నిర్మాతలతో ప్రొడక్షన్ హౌస్‌లతో సమావేశమైనట్లు టాక్..

SS Rajamouli big advance plans for mahesh babu project

ఈ సమావేశాలతో పాటు, రాజమౌళి తన రాబోయే ప్రాజెక్ట్‌ల కోసం వివిధ VFX హౌస్‌లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు టాక్. ఈ సహకారాన్ని సులభతరం చేయడానికి దర్శకుడు అమెరికాను తన రెండవ ఇల్లుగా చేసుకున్నాడు. రామ్ చరణ్ అతని భార్య ఉపాసన సమీపంలోని 7 స్టార్ హోటల్‌లో ఉండగా రాజమౌళి మాత్రం బృందంతో కలిసి డ్యూప్లెక్స్ హౌస్‌లో ఉంటున్నారు.

SS Rajamouli big advance plans for mahesh babu project

రాజమౌళి తదుపరి సినిమాను మహేష్ బాబుతో చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఆ సినిమా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుందట. ఇక సినిమాకు సంబంధించిన అనేక రకాల విషయాల గురించి హాలీవుడ్ టెక్నీషియన్స్ తో రాజమౌళి చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇక ఆ సినిమా కోసం మహేష్ బాబు ఫిట్నెస్ లో కూడా చాలా మార్పులు చేయబోతున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు ఫినిష్ అయినట్లు తెలుస్తోంది. మరి సినిమాను ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X