Mahesh Babu రాజమౌళి మూవీ కోసం రంగంలోకి దిగిన మహేష్... వర్కవుట్ లుక్ వైరల్!
సూపర్ స్టార్ మహేశ్ బాబు... బీస్డ్ మోడ్ లోకి మారిపోయారు. అదేంటి అనుకుంటున్నారా... తాజాగా ఆయన షేర్ చేసిన ఫోటో చూస్తే.. అలాగే అనిపిస్తుంది. ఇక ఈ జిమ్ వర్కౌట్స్.. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి సినిమా కోసమే బాబు రంగంలోకి దిగి వర్కౌట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ ఫోటో వైరల్ గా మారింది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా మీనాక్షి చౌదరి, శ్రీలీల నటిస్తున్నారు. మొదట ఈ సినిమాలో పూజా హెగ్డే అనుకున్నప్పటికీ... ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. ఇక ఆ స్థానంలో మీనాక్షి చౌదరి వచ్చి చేరింది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ 2024 సంవత్సరంలో రిలీజ్ కానుంది.

ఇక ప్రస్తుతం గుంటూరు కారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. మహేశ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు... ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక రాజమౌళి కూడా స్క్రిప్ట్ వర్క్ పనులు పూర్తి చేశాడని వార్తలు వస్తున్నాయి. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మహేశ్ బాబు కోసం.. ఎన్నడూ వినని కథను సిద్ధం చేశారట.
ఇక రాజమౌళి ఆ కథను ఓకే చేశారని సమాచారం. ఇక మహేశ్ సినిమా ప్రాజెక్టు పనుల్లో రాజమౌళి బిజీగా ఉన్నట్లు ఇన్ సైడ్ వర్గాల సమాచారం. ఆ విషయం పక్కన పెడితే... మహేశ్ బాబు.. తన అభిమానులకు ఓ సర్ ప్రైజ్ ఇచ్చాడు. తను జిమ్ వర్కౌట్ చేస్తున్న ఓ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిలీజ్ చేశాడు. ఇక ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్ గా మారింది. మహేశ్ బాబు లుక్స్ పై నెటిజన్స్ పై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మహేశ్ బాబు జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటో చూస్తుంటే.... మహేశ్ బీస్ట్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఈ ఫోటోను చూసి చాలా మంది ఇక రాజమౌళి సినిమా కోసమే మహేశ్ కసరత్తులు స్టార్ట్ చేశాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక ఓవైపు రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశాడు.. మరోవైపు మహేశ్ బాబు జిమ్ వర్కౌట్ పిక్చర్ చూస్తే... రాజమౌళి సినిమా కోసమే ఇలా చేశాడని అభిమానులు అనుకుంటున్నారు.
ఇక రాజమౌళి సినిమాలో మహేశ్ బాబు మునుపెన్నడూ కనిపించని విధంగా ఉంటారట. ఇక హీరోల బాడీ విషయంలో రాజమౌళి ఎంత జాగ్రత్తలు తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమా కోసం మహేశ్ బాబు ట్రైనింగ్ తీసుకుంటారని తెలుస్తోంది. ఆఫ్రీకా అడవుల నేపథ్యంలో తెరకెక్కే ఈ సినిమా పాన్ వరల్డ్ మూవీగా రూపొందుతోంది. ఇక ఈ మూవీపై అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











