రాజమౌళి కొడుకు పెళ్లి: ఎన్టీఆర్ హల్‌చల్.. ఖరీదైన వాచీతో.. ధర ఎంతో తెలుసా?
Recommended Video

ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహం జైపూర్‌లో అంగరంగ వైభవంగా జరిపించేందుకు అంతా సిద్ధమైంది. జగపతి బాబు సోదరుడి కుమార్తె పూజా ప్రసాద్‌తో కొద్ది నెలల క్రితం కార్తికేయ వివాహ నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరి వివాహం డిసెంబర్ 30 ఘనంగా జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే..

జైపూర్‌లో రాజమౌళి ఫ్యామిలీ
ఇప్పటికే రాజమౌళి ఫ్యామిలీ జైపూర్‌కు చేరుకొన్నారు. కార్తీకేయ, పూజా ప్రసాద్‌తోపాటు ఇరువర్గాల బంధువులు, కుటుంబ సభ్యులు జైపూర్ ఎయిర్‌పోర్టులో దర్శనమిచ్చారు. తెలుగు సినీ ప్రముఖుల రాకతో జైపూర్ కోలాహాలంగా మారింది.

జైపూర్ ఫైవ్‌స్టార్ హోటల్‌లో
కార్తీకేయ, పూజా వివాహం జైపూర్‌లోని విలాసవంతమైన హోటల్ జరుగనున్నది. పింక్ సిటీకి సమీపంలోని కుకాస్ అనే ఫైవ్ స్టార్ హోటల్‌లో వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వివాహానికి భారతీయ సినిమా పరిశ్రమకు సంబంధించిన ప్రముఖులు హాజరుకానున్నారు.

ప్రభాస్, రానా, ఎన్టీఆర్‌తో
ఇప్పటికే ఈ వివాహం కోసం ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, నాగార్జున, ఎన్టీఆర్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు తమ కుటుంబాలతో సహా జైపూర్‌కు చేరుకొన్నారు. ఇంకా కొంత మంది శని, ఆదివారాల్లో అక్కడికి చేరుకొనే అవకాశం ఉంది.

ఖరీదైన వాచీతో ఎన్టీఆర్
కార్తీకేయ, పూజా పెళ్లికి హాజరైన వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఖరీదైన వాచీ ధరించిన ఆయన స్పెషల్ అట్రాక్షన్‌గా మారారు. కార్డ్ మిల్లే మెక్‌లారన్ ఆటోమాటిక్ వాచీని ధరించారు. మార్కెట్లో దీని ధర రూ.2,27,49,398 అంటే రెండో కోట్లకుపైనే అన్నమాట. దటీజ్ ఎన్టీఆర్.


Click it and Unblock the Notifications











