Sai Dharam Tej హెల్త్ పై థమన్ అప్‌డేట్.. ‘అతనికి థాంక్స్’.. ఇక రెండ్రోజుల్లో అంటూ ట్వీట్!

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై ప్రస్తుతం అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.. అయితే ఆయన ఆరోగ్యం ఎలా ఉంది అనే విషయం మీద ఒక్కొక్కరు ఒక్కో విధంగా మాట్లాడుతూ ఉండటంతో అసలు సాయి ధరంతేజ్ ఆరోగ్య పరిస్థితి ఏమిటి అనే దానిమీద పెద్ద ఎత్తున చర్చోప చర్చలు జరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ విషయం మీద మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక ఆసక్తికర అప్డేట్ అందించారు. ఆ వివరాల్లోకి వెళితే

తీవ్రగాయాలు

తీవ్రగాయాలు

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఫిబ్రవరి 10వ తేదీన రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో కేబుల్ బ్రిడ్జి దాటిన తర్వాత కోహినూర్ హోటల్ వద్ద ఆయన ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి కింద పడడంతో సాయి ధరమ్ తేజ్ కు తీవ్రగాయాలయ్యాయి.

ఎందుకీ సైలెన్స్

ఎందుకీ సైలెన్స్

ఆయనను హుటాహుటిన దగ్గరలో ఉన్న ఒక హాస్పిటల్ కి తీసుకు వెళ్ళిన తర్వాత మెరుగైన చికిత్స కోసం అపోలో ఆస్పత్రికి తరలించారు. అపోలో ఆస్పత్రికి తరలించిన తర్వాత ఆయన కాలర్ బోన్ డిస్ లొకేట్ అయిన కారణంగా శాస్త్ర చికిత్స చేసి వైద్యులు సరి చేశారు. ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ఆయన హెల్త్ అప్ డేట్స్ ఇస్తూ వచ్చారు.

కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ అసలు హెల్త్ అప్ డేట్స్ ఇవ్వడం మానేశారు. చివరిగా అపోలో ఆస్పత్రి వైద్యుల నుంచి వచ్చిన అధికారిక సమాచారం అంటూ ఒక రెండు మూడు రోజుల్లో ఆయన విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయనే వార్త ఒకటి బయటకు వచ్చింది. అయితే ఆ తర్వాత కూడా ఆయన విడుదల అయినట్లు వార్తలు బయటకు రాలేదు.

పవన్ అలా, దేవా ఇలా

పవన్ అలా, దేవా ఇలా

తాజాగా రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ ఇంకా కోమాలోనే పడి ఉన్నాడు అని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ తర్వాత సినిమా ప్రమోషన్లో పాల్గొంటూ రిపబ్లిక్ సినిమా దర్శకుడు దేవాకట్టా మాత్రం సాయి ధరమ్ తేజ్ మెలకువగానే ఉన్నాడని తాను కూడా వెళ్లి మాట్లాడి వచ్చాను అని అన్నారు.

ధమన్ ఏమన్నారంటే?

ధమన్ ఏమన్నారంటే?

సాయి ధరంతేజ్ కోరిక మేరకు సినిమాను అక్టోబర్ ఒకటో తేదీన విడుదల చేస్తున్నామని ప్రీ రిలీజ్ ఈవెంట్ సైతం సాయితేజ్ వీక్షించాడని ఆయన అన్నారు.. అయితే పవన్ కోమాలో ఉన్నాడని చెప్పడం దర్శకుడు ఏమో బాగానే ఉన్నాడు అని చెప్పడంతో అసలు సాయి ధరంతేజ్ పరిస్థితి ఎలా ఉంది అనే విషయం మీద ఎలాంటి క్లారిటీ లేకుండా పోయింది. రకరకాల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ సన్నిహితంగా మెలిగే దర్శకుడు సంగీత దర్శకుడు తమన్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

Recommended Video

Ss Thaman Releases Richie Gadi Pelli Song | Kailash Kher సూపర్
రెండ్రోజుల్లో కలుస్తా

రెండ్రోజుల్లో కలుస్తా


సాయి ధరంతేజ్ హెల్ ఇప్పుడు బాగానే ఉందని 'మన అందరి ప్రార్థనలు ఫలించాయి.. నా మిత్రుడు సాయి థరమ్ తేజ్ వేగంగా కోలుకుంటున్నాడు.. అతని హెల్త్‌కు సంబంధించి అప్‌డేట్ ఇచ్చినందుకు సతీష్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరో రెండు రోజుల్లో నా మిత్రుడిని కలుసుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది' అంటూ థమన్ ట్వీట్ చేశారు. ఇక సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం బాగానే ఉందని మెగా అభిమానులు ఆనంద పడుతున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా రేపు విడుదల కాబోతుండగా ఇప్పటికే ప్రీమియర్ షోను చూసిన హీరో నాని, పాప్ సింగర్ స్మిత వంటివాళ్లు సినిమా అద్భుతంగా ఉందని తన సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X