SSMB 29: రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్... కానీ ఓ ట్విస్టు!

దర్శక ధీరుడు రాజమౌళి... ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా కథ కూడా సిద్ధం చేసినట్లు రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పుకువచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఓ ట్విస్టు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.

ప్రస్తుతం మోస్ట్ అవైటెట్ చిత్రాల జాబితాలో రాజమౌళి, మహేష్ బాబు సినిమా ఒకటి. ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత చాన్నాళ్లపాటు ఆ మూవీ ప్రమోషన్లలోనే బిజీగా ఉన్న రాజమౌళి.. ప్రస్తుతం మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా కథ పూర్తి చేసినట్లు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ తెలిపారు.

SSMB 29 Update: No Remuneration For Mahesh Babu in Rajamouli Film

ఇక ఈ సినిమా షూటింగ్ కోసం.. లోకేషన్ల వేటలో పడిపోయారు జక్కన్న. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. రాజమౌళి సినిమాలో హీరోల రెమ్యునరేషన్ కోట్లలో ఉంటుందనే విషయం తెలిసిందే. కానీ మహేష్ బాబు ఈ సినిమా కోసం షాకింగ్ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారు. అది ఎన్ని కోట్లో అని ఆలోచిస్తున్నారా... రాజమౌళి సినిమా కోసం.. మహేష్ రెమ్యునరేషన్ జీరో.

మీరు విన్నది నిజమే.. రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు జీరో రెమ్యునరేషన్ అంటే ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. ఈ న్యూస్ టాలీవుడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఇక్కడే ఓ ట్విస్టు ఉందని తెలుస్తోంది. అయితే రాజమౌళితో సినిమా అంటే... 2 సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాలు టైం వెచ్చించాలి. అన్ని ఏళ్లు మహేష్ బాబు డేట్స్ ఇవ్వాలి. అలాంటి సినిమాకు మహేష్ బాబు రెమ్యునరేషన్ తీసుకోకపోవడం ఏంటని అనుంటున్నారా...

మహేష్ బాబు 3 సంవత్సరాల వరకు రాజమౌళికి డేట్స్ ఇస్తా అని హామీ ఇచ్చారట. కానీ.. తమ ఇద్దరి కెరియర్లో బెస్ట్ అవుట్ పుట్ అందించాలని కండిషన్ పెట్టారట. ఇక ఈ సినిమాకు రెమ్యునరేషన్ కాకుండా.. పార్టనర్ షిఫ్ అడుగుతున్నండని తెలుస్తోంది. ఇక ఈ సినిమాకు కేఎల్ నారాయణ నిర్మతగా ఉన్నారు. అయినప్పటికీ.. ఆ బడ్జెట్ అంతా రాజమౌళి పెడుతున్నారని తెలుస్తోంది. మరి మహేష్ కండిషన్ కు రాజమౌళి ఒప్పుకుంటారా లేదా అనేది చూడాలి.

SSMB 29 Update: No Remuneration For Mahesh Babu in Rajamouli Film

ఇప్పటికే రాజమౌళి ఈ సినిమా కోసం లొకేషన్లను ఫైనల్ చేశారట. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి అయ్యాయని తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని టాక్. ఏప్రిల్లో షూటింగ్ మొదలు కానున్నట్లు తెలుస్తోంది. జక్కన్న ఇప్పటికే అమెరికాలోని ప్రముఖ క్యాస్టింగ్, వీఎఫ్ఎక్స్ ఏజెన్సీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాడనే విషయం తెలిసిందే. పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ లెవల్లో తన నెక్ట్స్ మూవీని తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు జక్కన్న.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X