నెరవేరిన సుశాంత్ కల... లక్షమొక్కలు నాటిన అభిమానులు
సినీ రంగుల ప్రపంచంలో అడుగుపెట్టి ఓ సూపర్ స్టార్ గా ఎదగాలి అని ఎందరో ఇండస్ట్రీలోకి వస్తుంటారు. కానీ, సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాత్రం ఈ కలతో పాటూ మరో 49 కలలు కన్నాడు. వాటిలో ఎన్నింటినో బతికుండగానే నెరవేర్చుకున్నాడు. మిగిలిన కలలను సాకారం చేసుకునే లోగానే లోకాన్ని విదిలి వెళ్లిపోయాడు. అయితే, మరణం శరీరానికే కానీ, తన సంకల్పానికి కాదని నిరూపించాడు. అందుకే సుశాంత్ కలను తమ బాధ్యతగా భుజాన్న వేసుకుని దాన్ని సాకారం చేశారు అభిమానులు.
సుశాంత్ రాసుకున్న 50కలల్లో ప్రపంచవ్యాప్తంగా వెయ్యి చెట్లు నాటాలన్నది ఓ లక్ష్యం. సుశాంత్ మరణానంతం ఆ బాధ్యతను అతడి అక్క శ్వేతా సింగ్ తీసుకున్నారు. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు అతడు లేకపోయినా, మేము ఉన్నాం అంటూ అభిమానులు ముందుకు వచ్చారు. ఆమెకు బాసటగా నిలబడ్డారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాల్సిందిగా శ్వేతా సామాజిక మాధ్యమాల్లో చేసిన విన్నపానికి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

సుశాంత్ కలలు కన్న వెయ్యి మొక్కల కార్యక్రమం కాస్తా లక్ష మొక్కల దాకా సాగింది. దేశ విదేశాల్లోని సుశాంత్ అభిమానులు సైతం ఈ కార్యక్రమంలో పాలుపంచుకుని ఈ మహాప్రస్థానాన్ని సక్సెస్ ఫుల్ గా పూర్తిచేశారు. అభిమానులతో పాటూ సుశాంత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే, దిల్ బేచారా దర్శకుడు ముఖేష్ చాబ్రాతో పాటూ ఇతర సెలబ్రిటీలు సైతం మొక్కలు నాటి సుశాంత్ కు నివాళి అర్పించారు.


Click it and Unblock the Notifications











