Siddhu Jonnalagadda : జాక్‌గా మారిన డీజే టిల్లు..ఈ సారి కొంచెం సిద్దూకి క్రాక్ అంటమరీ

Siddhu Jonnalagadda: టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరో, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. ఇటీవలే డీజే టిల్లుకు సీక్వెల్‌గా వచ్చిన టిల్లు 2 తో భారీ బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టారు ఈ యంగ్ హీరో. ఈ సారి సిద్దు మరో క్రేజీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రేజీ మూవీని బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రానికి 'జాక్ కొంచెం క్రాక్ ' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ మూవీలోని సిద్దు జంటగా వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. ఈ మూవీ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత బివిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ షూట్ గురించి ఓ క్రేజీ అప్‌డేట్ అందించారు. ఇంతకీ మన డీజే టిల్లు కొత్త మూవీ క్రేజీ అప్ డేట్ ఏంటో మీరు కూడా ఓ లూక్కేయండి.

star boy Sidhu Jonnalagadda new movie Jack- A little crack update

జాక్- కొంచెం క్రాక్ మూవీ మేకర్స్ మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 15 నుంచి నేపాల్‌లో షూటింగ్ ప్రారంభం కానున్నదనీ, ఈ షెడ్యూల్‌తో 80 శాతం షూటింగ్ పూర్తవుతుందని వెల్లడించారు. ఈ చిత్రానికి అచ్చు రాజమణి సంగీతాన్నిఅంచనున్నారు. ఇప్పటికే ఆయన పలు సినిమాలకు అద్భుతమైన ట్యూన్స్ అందించారు. ఈ మూవీతో సెన్సెషన్ క్రియేట్ చేస్తారని మూవీ టీం భావిస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఈ మూవీలో ప్రకాష్ రాజ్, నరేష్, బ్రహ్మాజీలు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు.

ఈ మూవీలో జాక్ అనే పాత్రను సిద్దు పోషిస్తున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఎంటంటే.. సిద్దు ఈ మూవీలో కాస్త క్రాక్ ఉండే పాత్రలో నటించబోతున్నారు. ఇక హీరోయిన్ వైష్ణవి ముస్లిం అమ్మాయి పాత్రలో కనిపించనున్నది. ఇప్పటికే విడుదల అయినా.. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ అందర్నీ ఆట్రాక్ట్ చేస్తుంది. సిద్దు, వైష్ణవి జంటగా నటించడం ఇదే మొదటి సారి. ఈ పెయిర్ ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ ఇవ్వబోతుందట. మరి జోడీ ఎంత వరకు అట్రాక్ట్ చేస్తుందో వేచి చూడాలి.

star boy Sidhu Jonnalagadda new movie Jack- A little crack update

ఇక భాస్కర్ విషయానికి వస్తే.. బొమ్మరిల్లు సినిమాతో ఇండస్ట్రీలో భారీ విజయాన్నిఅందుకున్నారు. కానీ, ఆ తరువాత వరుసగా ప్లాప్ ఎదుర్కొన్నారు. అఖిల్ అక్కినేనితో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా తీసి మంచి కమ్ బ్యాక్ ఇచ్చారు. కానీ బొమ్మరిల్లు రేంజ్ లో హిట్ కొట్టలేకపోయారు. నిజానికి బొమ్మరిల్లు బాస్కర్ కథకు, పాత్రలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. వరుసగా హిట్ మూవీస్ అందుకుంటున్న సిద్దు జొన్నలగడ్డ నయా మూవీ కూడా బ్లాక్ బాస్టర్ కానున్నదనీ భావిస్తున్నారు టిల్లు ఫ్యాన్స్.

More from Filmibeat

Read more about: jack siddhu jonnalagadda svcc37
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X