క్రేజీ న్యూస్.. మురుగదాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య చిత్రం తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. గత ఏడాది మేలో నా పేరు సూర్య చిత్రం విడుదలై నిరాశపరిచింది. ఇటీవల బన్నీ తన కొత్త చిత్రం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శత్వంలో ఉంటుందని ప్రకటించాడు. ఈ చిత్రానికి సన్నాహకాలు జరుగుతున్నాయి. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కబోతోంది. అల్లు అర్జున్ నటించే మరో చిత్రం గురించి కూడా క్రేజీ న్యూస్ వస్తోంది.
సౌత్ ఇండియా స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శత్వంలో అల్లు అర్జున్ నటించబోతున్నాడట. ఇటీవలే బన్నీ, మురుగదాస్ మధ్య చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. మురుగదాస్ తమిళ దర్శకుడే అయినప్పటికీ తెలుగు హీరోలతో కూడా టచ్ లో ఉంటాడు. మెగా ఫ్యామిలీతో మురుగదాస్ కు సాన్నిహిత్యం ఉంది. మెగాస్టార్ చిరంజీవి స్టాలిన్ చిత్రం మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఇక 2017లో మురుగదాస్ సూపర్ స్టార్ మహేష్ హీరోగా స్పైడర్ చిత్రాన్ని రూపొందించాడు. ఆ చిత్రం నిరాశపరిచింది. దీనితో తెలుగులో పవర్ ఫుల్ చిత్రం రూపొందించి తన సత్తా చాటాలని మురుగదాస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో బన్నీ, మురుగదాస్ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











