అజిత్ చిత్రానికి కూడా అదే సమస్య.. విడుదల వాయిదా!

అజిత్, శివ కాంబినేషన్ లో వరుసగా వస్తున్న 4వ చిత్రం విశ్వాసం. అజిత్, నయనతార జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. జనవరి 10 విశ్వాసం చిత్రం విడుదల చేయాలనీ ముందుగా నిర్ణయించారు. అదే రోజున రజినీకాంత్ పేట కూడా విడుదల కానుండడంతో సంక్రాంతి పోరుపై ఉత్కంఠ నెలకొని ఉంది. అజిత్, రజిని ఇద్దరికీ తమిళనాట ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

తాజా సమాచారం ప్రకారం విశ్వాసం చిత్ర తెలుగు వర్షన్ విడుదల వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. తెలుగులో ఇప్పటికే నాలుగు భారీ చిత్రాలు విడుదలవుతున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్, వినయ విధేయ రామ, పేట, ఎఫ్2 చిత్రాలు సంక్రాంతికి విడుదలవుతున్న సంగతి తెలిసిందే. రజినీకాంత్ చిత్రానికే తెలుగులో థియేటర్స్ కొరత ఏర్పడింది. కానీ ఎలాగోలా విడుదల చేస్తున్నారు.

Star Hero Ajith, Nayantharas Viswasam telugu release delay

అజిత్ విశ్వాసానికి తెలుగులో థియేటర్స్ దొరికే పరిస్థితి లేకపోవడంతో ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డేకి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. తమిళంలో మాత్రం యథాతధంగా సంక్రాంతికే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలో అజిత్ గెటప్ అభిమానులని విపరీతంగా ఆకర్షిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X