మజిలీ రీమేక్‌లో నటించబోతున్న స్టార్ హీరో!
నాగ చైతన్య, సమంత జంటగా నటించిన మజిలీ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన మజిలీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. మజిలీ నాగచైతన్య కెరీర్ లోనే అత్యధిక వసూళ్ల సాధించిన చిత్రంగా నిలవనునట్లు తెలుస్తోంది. మజిలీ చిత్రంతో నాగ చైతన్య చాలా రోజుల తర్వాత మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ ఎమోషనల్ కథపై ప్రస్తుతం పరభాషా నటుల దృష్టి పడ్డట్లు తెలుస్తోంది.
తమిళ స్టార్ హీరో ధనుష్ మజిలీ రీమేక్ హక్కులని సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ తరహా కథ ధనుష్ బాడీ లాంగ్వేజ్ కు సరిపోతుందని అంటున్నారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. రఘువరన్ బిటెక్ చిత్రంలో ధనుష్ తన నటనతో ఎంటర్టైన్ చేసిన సంగతి తెలిసిందే. శివ నిర్వాణ మజిలీ చిత్రాన్ని చాలా చక్కగా మలిచారు. తమిళంలో ఎవరు డైరెక్ట్ చేస్తారో వేచి చూడాలి.

మజిలీ రీమేక్ హక్కులని ధనుషే సొంతం చేసుకున్నాడు కాబట్టి ఆయనే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉంది. ధనుష్ ప్రస్తుతం అసురన్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి వెట్రిమారన్ దర్శకుడు. ధనుష్ చివరగా నటించిన చిత్రం మారి 2. ధనుష్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలయింది.


Click it and Unblock the Notifications











