రామ్ చరణ్ ఓటీటీ బిజినెస్.. యువ హీరోలతో కలిసి భారీ వెబ్ సిరీస్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓటీటీ బిజినెస్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. ప్రస్తుతం వెబ్ సిరీస్ లకు డిమాండ్ ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. భవిష్యత్తులో సినిమాలు కూడా డైరెక్ట్ గా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోకే రానున్నాయి. దీంతో స్టార్ హీరోలు కూడా ముందుగానే అటు వైపు ఒక దారిని సెట్ చేసుకుంటున్నారు. బాలీవుడ్ లో ఇప్పటికే షారుక్ ఖాన్ బేతాల్ అనే వెబ్ సిరీస్ ని నిర్మించాడు.
బేతాల్ వెబ్ సిరీస్ నిర్మించిన షారుక్ ఖాన్ మంచి సక్సెస్ అయితే అందుకున్నాడు. ఇక అదే తరహాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నెట్ ఫ్లిక్స్ తో కలిసి భారీ వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అంటే కేవలం నిర్మాతగానే. అందుకు టాలెంట్ ఉన్న యువ హీరోలను కూడా సెట్ చేసుకోబోతున్నాడట. ఇప్పటికే వెబ్ సిరీస్ కి సంబంధించిన రెండు స్క్రిప్ట్ లను విన్నట్లు సమాచారం.

ప్రస్తుతం RRR సినిమాతో చరణ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం ఉంది. దీంతో ఈ గ్యాప్ లో వెబ్ సిరీస్ ల ద్వారా ఒక కొత్త తరహా బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఒకేసారి నేషనల్ లెవెల్ లో క్లిక్ అయ్యేలా మంచి థ్రిల్లర్ అంశాలున్నా కథలను వింటున్నాడట. అంటే అన్ని భాషల్లో ఆదరణ పొందేలా వెబ్ సిరీస్ లను నిర్మించాలన్నది చరణ్ ఆలోచన. మరి ఆ కథలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











