Vijay Devarakonda: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్ దేవరకొండ.. 100 మంది ఫ్యాన్స్ కోసం ఫ్రీ ట్రిప్!

టాలీవుడ్ రౌడీ స్టార్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ను సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా తన క్రేజ్ ను మరింత పెంచుకుంటూ వెళుతూ ఉన్నాడు. లైగర్ సినిమా అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోయినప్పటికీ కూడా అతని క్రేజ్ ఏమిటో ఆ సినిమాతో అర్థం అయింది. ఇక ఫ్యాన్స్ తో కూడా అతను చాలా క్లోజ్ గా ఉంటాడు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మొదటి సినిమా నుంచి కూడా విజయ్ దేవరకొండ తన విజయ ఆనందాన్ని ఏదో ఒక విధంగా అయితే అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటాడు. ఇక ఏదైనా స్పెషల్ డేస్ ఉంటే కూడా తన ప్రేమను చాటుకుంటూ ఉంటాడు. ఇక ప్రతి ఏడాది క్రిస్మస్ సందర్భంగా ఏదో ఒక గిఫ్ట్ లతో ఫ్యాన్స్ ను ఆనందానికి గురి చేస్తూ ఉంటాడు. ఇక విజయ్ దేవరకొండ ఈసారి 100 మంది ఫ్యాన్స్ ను సెలెక్ట్ చేసి వారికి మనాలి వెళ్లే విధంగా స్పెషల్ వెకేషన్ ఏర్పాటు చేయడం విశేషం.

Star hero Vijay devarakonda free trip offer to his lovely fans

దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఒక వందమందిని ఎంపిక చేశారు. ఇక రీసెంట్ గా ఆ 100 మందిని ఫైనల్ చేసిన విజయ్ దేవరకొండ టీమ్ మొత్తానికి ఫిబ్రవరి 17 నుంచి 20వ తేదీ వరకు వెకేషన్ కు పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక శుక్రవారం రోజు వీరి ప్రయాణం మొదలైంది. అందుకు సంబంధించిన వీడియోను కూడా విజయ్ దేవరకొండ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఆనందంగా ఉంది అని పాజిటివ్ గా స్పందించాడు.

ఈరోజు ఉదయం వాళ్ళు ఫ్లైట్ లో ఉన్న వీడియోను నాకు సెండ్ చేశారు. మనాలి పర్వతాల్లోకి హాలిడే ఎంజాయ్ చేయడానికి వెళుతున్నారు. దాదాపు దేశంలోనే వందమంది అందులో ఉన్నారు. ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అని విజయ్ దేవరకొండ ప్రత్యేకంగా ట్వీట్ చేశాడు. ట్రావెల్ ఖర్చులో పాటు ఫుడ్ ఖర్చులు అన్నీ కూడా విజయ్ దేవరకొండ భరిస్తు వారికోసం ప్రత్యేకంగా ముందుస్తుగా ప్రణాళికలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఎవరికీ ఏం ఇబ్బంది రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ నెక్స్ట్ ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. అలాగే గౌతమ్ తిన్నానూరి దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడు. ఇటీవల పరశురామ్ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X