twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరో ఇంటికి బెదిరింపు లేఖ.. కుటుంబ సభ్యులకు హెచ్చరికలు

    |

    తమిళ స్టార్ హీరో విజయ్ ఇంటికి హెచ్చరికలతో కూడిన లేఖ రావడం ఆయన అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు, తమిళ హీరోల్లో కెల్లా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న విజయ్ కూడా ఈ లేఖ చూసి షాకయ్యారట. ఇంతకీ ఇది ఎవరి పనై ఉంటుందని చూడగా.. అది తిరుపూర్‌కు చెందిన బీజేపీ యువజన విభాగం చేసిన ఆక్టివిటీ అని తెలిసింది.

    విజయ్‌ తండ్రి, దర్శకుడు ఎస్‌ఏ.చంద్రశేఖర్‌ ఇటీవల ఒక సినీ వేడుకలో బీజేపీ పై పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. రాజకీయ నాయకుల అండ చూసుకొనే పైరసీ దారులు రెచ్చిపోతున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో పోరాటాల తోనే ప్రభుత్వాన్ని తట్టిలేపే ప్రయత్నం చేయాలన్నారు. అదే ఎంజీఆర్ కాలంలో రాజకీయం సజావుగా సాగేదని, అప్పట్లో ఇలాంటి అక్రమాలకు తావు లేదని పేర్కొంటూ బీజేపీపై ప్రభుత్వాన్ని పరోక్షంగా సెటైర్స్ వేశారు. అంతేకాదు ఎన్నికల ఫలితాలు బీజేపీకి అనుకూలంగా వస్తే.. ఇక అందరూ కాషాయ వస్త్రాలు చుట్టుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుందని బీజేపీ తీరుపై వివాదాస్పదంగా మాట్లాడారు హీరో విజయ్ తండ్రి ఎస్‌ఏ.చంద్రశేఖర్‌.

    Star Hero Vijay got a controversial letter

    ఈ నేపథ్యంలో బీజేపీ మరోసారి విజయకేతనం ఎగరేయడం జరిగింది. దీంతో వెంటనే తిరుపూర్‌కు చెందిన బీజేపీ యువజన విభాగం పేరుతో హీరో విజయ్ ఇంటికి కాషాయ పంచె, ఒక లేఖ తో కూడిన పార్సిల్‌ వచ్చింది. ఇందులో ఇప్పుడు మొదటిసారిగా కాషాయ వస్త్రాన్ని పంపుతున్నామని, ఇకపై వరుసగా ఇలాంటి వస్త్రాలను పంపుతూనే ఉంటామని పేర్కొంటూ విజయ్ కుటుంబ సభ్యులను ఆ లేఖ ద్వారా హెచ్చిరించినట్లు సమాచారం.

    ఇక విజయ్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే సర్కార్ సినిమాతో సక్సెస్ అందుకున్న విజయ్.. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. తమిళ, తెలుగు భాషలతో పాటు సౌత్ సినిమాల్లో విజయ్‌కి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

    Read more about: vijay bjp విజయ్
    English summary
    Star Hero Vijay got a controversial letter. This letter was directly post in to his house.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X