Vijay మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్యలో మాటల యుద్ధం.. దారుణంగా బూతులతో ట్రేండింగ్

సినిమా ప్రపంచంలో ఒక సినిమాతో మరొక సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడడం సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. అయితే అభిమానుల మధ్యలో ఒకప్పుడు బహిర్గతంగా జరిగే గొడవలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ట్విట్టర్ లో అయితే దారుణమైన బూతులతో ట్రేండింగ్ చేస్తూ ఉండడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇక రీసెంట్ గా మరోసారి మహేష్ బాబు, విజయ్ ఫ్యాన్స్ మధ్యలో గొడవలు తారస్థాయికి చేరాయి.. పూర్తి వివరాల్లోకి వెళితే..

విజయ్ రేంజ్

విజయ్ రేంజ్

మహేష్ బాబుకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారు. అదే తరహాలో విజయ్ కూడా ఇప్పుడిప్పుడే దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ సంఖ్యను పెంచుకుంటున్నాడు. ముఖ్యంగా తెలుగులో అతని సినిమాలు ఇటీవల కాలంలో మంచి ఒపెనింగ్స్ అందుకుంటున్నాయి. ప్రస్తుతం డైరెక్ట్ గా తెలుగు తమిళ్లో ఒకేసారి వారసుడు అనే సినిమా కూడా చేస్తున్నాడు.

స్టార్ హీరోలకు ఇబ్బందిగా

స్టార్ హీరోలకు ఇబ్బందిగా

భాషతో సంబంధం లేకుండా సినిమాలు ఇప్పుడు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాయి. అయితే ఎన్ని మార్పులు వచ్చినా కూడా అభిమానుల మధ్యలో మాత్రం మార్పులు రావడం లేదు. ఒక చిన్న విషయంతో గొడవలు ఎక్కడికో వెళ్ళిపోతున్నాయి. ఊహించని స్థాయిలో బూతులతో ట్యాగ్స్ ట్రెండింగ్ అయ్యేలా చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒక విధంగా స్టార్ హీరోలో కు అవి చాలా ఇబ్బందిగా మారుతాయి అని కూడా చెప్పవచ్చు.

దారుణంగా ట్రోలింగ్

దారుణంగా ట్రోలింగ్

గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో విజయ్ మహేష్ బాబుకు సంబంధించిన నెగటివ్ ట్యాగ్స్ అయితే ట్రెండింగ్ లిస్టులోకి చేరిపోతున్నాయి. ముఖ్యంగా విజయ్ పై అయితే మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాకుండా ఇతర వర్గం వారు కూడా దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. అతని నటనపై అలాగే రీమేక్ సినిమాలకు సంబంధించిన సీన్స్ కూడా పోస్ట్ చేస్తూ ఇదెక్కడి యాక్టింగ్ అంటూ తిడుతున్నారు.

 అసలు కారణం

అసలు కారణం

ఒక యూ ట్యూబ్ ఛానెల్ మహేష్, విజయ్ సినిమాల ఫలితాలపై వివరణ ఇస్తూ పోస్ట్ చేసిన వీడియో నుంచి అసలు గొడవ మొదలైంది. ఎవరో ఒకరు కామెంట్ చేయడంతో ఫ్యాన్స్ అందరూ కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఒక దశలో మీ హీరో తేడా అంటూ ట్యాగ్స్ ను నెంబర్ వన్ ట్రెండింగ్ లిస్ట్ లోకి తీసుకు రావడం వైరల్ గా మారిపోయింది.

స్టార్స్ ఇష్టపడరు

స్టార్స్ ఇష్టపడరు

అసలు ఈ రేంజ్ లో అభిమానులు ఎందుకు రియాక్ట్ అవుతున్నారు అనేది అతి పెద్ద సందేహం. ఒక విధంగా ఇలాంటి బూతులు మాట్లాడితే ఏ హీరో కూడా ఆ ఫ్యాన్స్ ను ఇష్టపడడు అని ఎందుకు అర్థం చేసుకోరు అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూడా ఫాన్స్ నెగటివ్ కామెంట్స్ కారణంగా ఇప్పుడు స్టార్స్ సోషల్ మీడియాలో ఏ విషయంపై స్పందించాలన్న కూడా కాస్త భయపడుతున్నారు అనే చెప్పాలి. మరి రాబోయే రోజుల్లో ఈ వార్ ఇంకా ఏ రేంజ్ కు వెళుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X