twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవి 'పాలిటిక్స్'.. ఆయన మాటలకు అర్థం ఏమిటబ్బా?

    |

    మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా సినిమాల మీద ఫోకస్ పెట్టారు. గతంలో రాజకీయ పార్టీ కూడా స్థాపించిన ఆయన ఆ తర్వాతి కాలంలో దానిని కాంగ్రెస్ లో విలీనం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

    Recommended Video

    Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
    మంచి నెంబర్ తో

    మంచి నెంబర్ తో

    మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి సీఎం అవ్వాలనే ఉద్దేశంతో 2009 ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ఆయన పార్టీ పూర్తి స్థాయిలో గెలవకపోయినా 18 స్థానాలు సాధించి చెప్పుకోదగ్గ రీతిలో నిలబడింది.. ఆ తర్వాత పరిణామాల్లో జగన్ సొంత కుంపటి పెట్టుకోవడంతో చిరంజీవి మద్దతు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కావలసి వచ్చింది

     విలీనం

    విలీనం

    చిరంజీవి కూడా ఒక పార్టీ నడపలేనని భావిస్తూ పార్టీని తీసుకెళ్లి విలీనం చేశారు. 18 మంది ఎమ్మెల్యేలలో కొంత మందికి మంత్రి పదవులు దక్కగా చిరంజీవి సైతం కేంద్ర టూరిస్టు శాఖ మంత్రి పదవి దక్కింది. అలా 2014 వరకు పనిచేసిన ఆయన ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తి చూపించ లేదు. 2014లో రాష్ట్ర విభజన జరగడం ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పూర్తిగా దెబ్బతినడంతో చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

    రీ ఎంట్రీ

    రీ ఎంట్రీ

    అందరూ ఊహించినట్లుగానే చిరంజీవి అప్పటి నుంచి రాజకీయాలకు దూరమయ్యారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని భావించిన ఆయన ఎట్టకేలకు ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని సైరా సినిమాలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న ఆయన చేతిలో అది కాకా దాదాపు మూడు సినిమాలున్నాయి.

    కాంగ్రెస్ లో ఉన్నాడా ? లేడా

    కాంగ్రెస్ లో ఉన్నాడా ? లేడా


    అయితే చిరంజీవి తమ పార్టీలో లేడంటూ కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జ్ ఊమెన్ చాందీ తాజాగా జరిగిన మీటింగ్ లో పేర్కొన్నారు. ఆయన సినిమాల్లోకి వెళ్లి పోయారు కాబట్టి ఆయన కాంగ్రెస్ మనిషి కాదని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యవహారం కాస్త హాట్ టాపిక్ గా మారడంతో వెంటనే రంగంలోకి దిగిన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ సాకే శైలజానాథ్ చిరంజీవి తమ పార్టీ మనిషే అని చెప్పుకొచ్చారు.

    అసలు ఆయన ఆలోచన ఏంటి

    అసలు ఆయన ఆలోచన ఏంటి

    ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీగా ఉండటంతో పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా ఉండటం లేదని లేదంటే ఆయన కాంగ్రెస్ కోసం ఏమైనా చేయడానికి చిరు సిద్ధమని అంటూ చెప్పుకొచ్చారు. దీంతో అసలు చిరంజీవి ఆలోచన ఏమిటి ? నిజంగా ఆయన కాంగ్రెస్ లో ఉన్నారా ? లేక పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నారా అనే అంశాల మీద మాత్రం క్లారిటీ మిస్ అవుతోంది. దీని మీద చిరంజీవి క్లారిటీ ఇస్తే తప్ప మరెవరు చెప్పినా ఏమీ అర్థం కాని పరిస్థితి.

    English summary
    AP Congress in-charge Oommen Chandy said Megastar Chiranjeevi is no longer in Congress. today AICC has given a clarification on chiranjeevi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X