twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాక్సాఫీస్ పోటీలో నా పేరు శివ 2.. జనవరిలో థియేట్రికల్ రిలీజ్‌కు సన్నాహాలు

    |

    సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు తప్పుకోవడంతో చిన్న సినిమాలకు ఒక లక్కీ ఛాన్స్ వచ్చిందనే చెప్పాలి. ఇక జనవరి చివరి వరకు కూడా పెద్దగా స్టార్ హీరోలు ఎవరు కూడా థియేటర్స్ లోకి రావడం లేదు. అయితే ఈ లక్కీ ఛాన్స్ ను వాడుకునెందుకు తమిళ సినిమాలు కూడా ఎంతో ఆసక్తిని చూపిస్తున్నాయి. ఇప్పటికే విశాల్ సామాన్యుడు సినిమా విడుదలకు సిద్దమైన విషయం తెలిసిందే. ఇక మార్కెట్ మీద పట్టు ఉన్న చాలామంది పంపిణీదారులు పాత సినిమాలను కూడా తెలుగులో డబ్ చేసి విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ప్రముఖ స్టూడియో గ్రీన్ కూడా ఇటీవల ఒక ప్రత్యేకమైన సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది.

    సూర్య సోదరుడు కార్తికి తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. అయితే అతని పాత సినిమాలు కూడా సక్సెస్ ఫుల్ టైటిల్ తో విడుదల చేస్తుండటం విశేషం. కార్తీ మొదట్లో నటించిన నాలుగైదు సినిమాలు తప్పితే చాలా వరకు తెలుగులో డబ్ అయ్యాయి. అందులో చాలా వరకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. నా పేరు శివ కూడా మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమా ఎవరూ ఊహించని విధంగా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు అందుకోవడం అప్పట్లో అందరిని ఆశ్చర్య పరిచింది. ఇక ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ అంటూ నా పేరు శివ 2 పోస్టర్ ను విడుదల చేశారు.

    Studio Green announcement karthi Na peru shiva 2 release

    ఈ సినిమా జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు స్టూడియోగ్రీన్ అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చేసింది. ఈ నెల చివర్లోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. పా.రంజిత్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఇటీవల కాలంలో పా.రంజిత్ తో కార్తీ నా పేరు శివ సినిమాకు సీక్వల్ ఎప్పుడు తీశాడు అని కొంతవరకూ తెలుగు ఆడియెన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ నిజానికి ఈ సినిమా నా పేరు శివ సినిమాకు కొనసాగింపుగా వస్తున్నది కాదు. అసలు ఆ సినిమాకు ఈ సినిమాకు సంబంధం లేదనే చెప్పాలి.

    పా.రంజిత్ దర్శకత్వంలో కార్తీక్ 2014లో మద్రాస్ అనే సినిమా తీశాడు. అయితే పొలిటికల్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో కేథరిన్ ట్రెసా మెయిన్ హీరోయిన్ గా నటించింది. ఇక తెలుగులో అప్పట్లో కొన్ని కారణాల వలన ఆ సినిమాను రిలీజ్ చేయలేదు. ఇక ఇప్పుడు జనవరిలో థియేట్రికల్ బిజినెస్ చాలా బాగుంది అని స్టూడియో గ్రీన్ దాన్ని క్యాష్ చేసుకోవాలని పాత మద్రాస్ సినిమాను మళ్ళీ కొత్తగా రెడీ చేస్తోంది. కార్తీ రేంజ్ కు తగ్గట్లుగానే డబ్బింగ్ చేసి కాస్త పాజిటివ్ వైబ్రేషన్స్ తో విడుదల చేయాలని అనుకుంటున్నారు. సినిమాకు కరెక్ట్ గా సెట్ అయ్యే విధంగా నా పేరు శివ టైటిల్ ను సెట్ చేశారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.

    English summary
    Studio Green announcement karthi Na peru shiva 2 release
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X