For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Allu Arjun బ్లాక్‌బస్టర్ మూవీ రీమేక్.. ఫ్యాన్సీ రేటుకు హక్కులు దక్కించుకొన్న స్టైలిష్ స్టార్!

  |

  టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ హిట్టు, ఫ్లాప్స్ అనే సంబంధం లేకుండా సక్సెస్ గ్రాఫ్ జోష్‌తో దూసుకెళ్తున్నది. అయితే విభిన్నమైన చిత్రాలు, విలక్షణమైన పాత్రలతో ఆకట్టుకొంటూ బాక్సాఫీస్ వద్ద దూకుడు ప్రదర్శిస్తున్నారు. అయితే తాజాగా సుకుమార్‌తో కలిసి క్రేజీ ప్రాజెక్టును చేపట్టిన స్టైలిష్ స్టార్ తాజాగా మలయాళం రీమేక్ రైట్స్ దక్కించుకోవడం అటు మలయాళ, తెలుగు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

  అల వైకుంఠపురం బ్లాక్ బస్టర్ మూవీతో

  అల వైకుంఠపురం బ్లాక్ బస్టర్ మూవీతో

  అల్లు అర్జున్ గతేడాది అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. అద్భుతమైన నటన, డ్యాన్సులతో ప్రేక్షకులను మెప్పించడంతో బాక్సాఫీస్ వద్ద రికార్డుల మోత మోగింది. దాంతో రూ.200 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెపాసిటీ ఏంటో దక్షిణాదిలో స్పష్టమైంది.

  గ్లామర్ తో మరోసారి రెచ్చగొడుతున్న వర్షిని.. హాట్ యాంకర్స్ కు పోటీగా ఘాటైన స్టిల్స్

  సుకుమార్‌తో పుష్పరాజ్‌గా

  సుకుమార్‌తో పుష్పరాజ్‌గా

  అల వైకుంఠపురం సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వం పుష్ప చిత్రంలో నటిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్లు, ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది. తగ్గేదేలే అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్స్ ట్రెండింగ్‌గా మారింది.

  డిసెంబర్‌లో పుష్ప చిత్రం రిలీజ్

  డిసెంబర్‌లో పుష్ప చిత్రం రిలీజ్

  అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో మూడో చిత్రంగా వస్తున్న పుష్ప చిత్రం రెండు భాగాలుగా రాబోతున్నది. ఈ చిత్రానికి స్టిల్స్, అల్లు అర్జున్ లుక్ అభిమానులను విశేషంగా ఆకట్టుకొంటున్నది. రష్మిక మందన్నతో కలిసి తొలిసారి నటిస్తున్న అల్లు అర్జున్ పుష్ప 2021 డిసెంబర్‌లో రిలీజ్‌కు సిద్దమవుతున్నది. ఈ చిత్రంలో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.

  పోర్న్ రాకెట్ నటి గెహానా వశిష్ట్ కళ్ళు చెదిరే ఫోటోలు.. మరీ ఇంతలా అందాల ఆరబోతా ?

  పుష్ప తర్వాత మలయాళం రీమేక్‌తో

  పుష్ప తర్వాత మలయాళం రీమేక్‌తో


  ఇక ఇదిలా ఉంటే.. మలయాళ చిత్ర పరిశ్రమలో భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన నాయట్టు చిత్రానికి సంబంధించిన రీమేక్ రైట్స్‌ను సుకుమార్ దక్కించుకొన్నట్టు సినీ వర్గాలు ధృవీకరించారు. నెటిఫ్లిక్స్‌లో స్టీమింగ్ అయిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకొన్నది. ప్రేక్షకుల మన్ననలు అందుకొన్న ఈ చిత్రంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రీమేక్ కావడానికి సిద్దమవుతున్నది. తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనున్నది. అయితే ఈ చిత్రంలో బన్నీ నటిస్తారా లేదా మరే హీరో అయినా చేస్తారా అనేది కొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

  సాయి పల్లవిని ఇలా ఎప్పుడైనా చూశారా.. కుటుంబ సభ్యులతో బ్యూటీఫుల్ ఫొటోస్

  హిందీ, తెలుగు, తమిళ భాషల్లో

  హిందీ, తెలుగు, తమిళ భాషల్లో


  ఇక హిందీలో నాయట్టు రీమేక్ చేయడానికి జాన్ అబ్రహం హక్కులను సొంతం చేసుకొన్నాడు. అలాగే తమిళంలో ఈ చిత్రాన్ని గౌతమ్ వాసుదేవన్ మీనన్ దర్శకత్వం వహించనున్నారు. తెలుగులో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించే దర్శకుడి కోసం వెతుకుతున్నట్టు సమాచారం. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం రూపొందింది. తెలుగు రీమేక్ గురించిన ప్రకటన అధికారికంగా త్వరలోనే వెలువడనున్నది.

  RRR update: తొలిసారి విదేశాల్లో రాజమౌళి టీమ్.. యుద్ద పోరాటాల కోసం ఎక్కడికి వెళ్లిందంటే..

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
  ఏప్రిల్ 8న రిలీజై భారీ విజయాన్ని..

  ఏప్రిల్ 8న రిలీజై భారీ విజయాన్ని..


  మాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకొన్న నాయట్టు చిత్రంలో కుచకో బోబన్, జోజు జార్జ్, నిమిషా సాజయన్ తదితరులు నటించారు. మార్టిన్ ప్రకాత్ దర్శకత్వం వహించగా.. రంజిత్; శశిధరన్, మార్టన్ ప్రకాత్ నిర్మించారు. ఈ చిత్రం 2021, ఏప్రిల్ 8వ తేదీన రిలీజైంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో కూడా విజయవంతం అవుతుందని ఆశిద్దాం.

  బాలీవుడ్, దక్షిణాది సినిమాకు సంబంధించిన తాజా వార్తలకు, తారల ఇంటర్యూలకు, ఫోటోగ్యాలరీలు, సినిమా ఈవెంట్లు, వివాదాస్పద అంశాలకు సంంధించిన వార్తా విశ్లేషణలకు ఫేస్‌బుక్, ట్విట్టర్ , ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్లను ఫాలో అవ్వండి.

  English summary
  Stylish star Allu Arjun busy with the Pushpa of Sukumars movie. Reports confirmed that Icon Star acquired Malayalam movie Nayattu remake rights to made malayalam movie into Telugu. Geeta Arts is going to produce this movie.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X