పాలకొల్లులో ఫ్యామిలీతో బన్నీ సంక్రాంతి సంబురం... 10 లక్షలతో కళ్యాణ మండపం

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలను తమ కుటుంబ స్వస్థలమైన పాలకొల్లులో జరుపుకున్నారు. సోమవారమే భార్య పిల్లలతో కలిసి పాలకొల్లు చేరుకున్న బన్నీకి ఫ్యాన్స్ నుంచి ఘన స్వాగతం లభించింది. రాజమండ్రి నుంచి తమ అభిమాన హీరోను ర్యాలీగా పాలకొల్లు తీసుకొచ్చారు.

Recommended Video

Allu Arjun And His Family Celebrating Sankranti In Palakollu | Filmibeat Telugu

పాలకొల్లులో తమ బంధువులు, సన్నిహితులతో కలిసి అల్లు అర్జున్ మకర సంక్రాంతి వేడుకల్లో మునిగి తేలారు. ఈ సందర్భంగా బన్నీని చూసేందుకు చుట్టుపక్కల ఊర్ల నుంచి భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బన్నీ ప్రసంగించారు. తమపై చూపిస్తున్న అభిమానానికి కృతజ్ఞతలు తెలిపారు.

కళ్యాణ మండపం కట్టిస్తానన్న బన్నీ

కళ్యాణ మండపం కట్టిస్తానన్న బన్నీ

‘మా కుటుంబానికి పాలకొల్లు చాలా ఇచ్చింది. నాకు ప్రతి సంక్రాంతి ఇక్కడే జరుపుకోవాలని ఉంటుందని తెలిపారు. పాలకొల్లు కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాను. అది ఈ సంవత్సరమే చేయబోతున్నట్లు తెలిపిన బన్నీ.... రూ. 10 లక్షల ఖర్చుతో కళ్యాణ మండపం కట్టించబోతున్నట్లు తెలిపారు. వెంటనే దీని నిర్మాణ పనులు ప్రారంభించబోతున్నారు.

అల్లు రామలింగయ్య విగ్రహం వద్ద సందడి

అల్లు రామలింగయ్య విగ్రహం వద్ద సందడి

పాలకొల్లులో ఏర్పాటు చేసిన తన తాతయ్య అల్లు రామలింగయ్య విగ్రహానికి బన్నీ, కుటుంబ సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఇదే విగ్రహం వద్ద నిల్చొని బన్నీ తన అభిమానులను ఉద్దేశించి ప్రసంగించారు

బంధువులతో కలిసి సంక్రాంతి

బంధువులతో కలిసి సంక్రాంతి

పాలకొల్లులోని తమ బంధుమిత్రులతో కలిసి అల్లు అర్జున్ సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారితో కలిసి గ్రూప్ ఫోటో దిగారు.

అల్లు అర్జున్ మూవీస్

అల్లు అర్జున్ మూవీస్

అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే... ఆయన చివరి సినిమా 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' విడుదలై ఆరు నెలలు దాటిపోయింది. తర్వాతి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోతున్నారు. అల్లు అర్జున్- త్రివిక్రమ్ కాంబినేషన్లో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూరి లాంటి హిట్ సినిమాలు వచ్చాయి. దీని తర్వాత వీరు ముచ్చటగా మూడోసారి కలిసి పని చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత షూటింగ్ ప్రారంభం కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X