70 ఏళ్లప్పుడు కూడా నటిస్తా.. ఆయనే స్ఫూర్తి.. స్టార్‌డమ్ కష్టం.. అల్లు అర్జున్

అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్‌ను అందుకొన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ జోరు కొనసాగించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. విభిన్న పాత్రలు ఎంచుకోవడానికి కారణం నాకు బాలీవుడ్ దిగ్గజం, బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ నాకు స్ఫూర్తి అంటూ తాజాగా ఆంగ్ల సినీ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. అల్లు అర్జున్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..

అమితాబ్ అంటే ఇష్టం

అమితాబ్ అంటే ఇష్టం

బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్ అంటే నాకు చాలా ఇష్టం. 70 ఏళ్ల వయసులో కూడా ఆయన యువ హీరోలతో కలిసి నటించే తీరు చూస్తే ముచ్చటేస్తుంది. ఆయన మాదిరిగానే నాకు 70 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయన పంథానే అనుసరించాలని అనుకొంటున్నాను అని అల్లు అర్జున్ తెలిపారు.

50 ఏళ్ల కెరీర్‌లో

50 ఏళ్ల కెరీర్‌లో

ఐదు దశాబ్దాల నటజీవితంలో అమితాబ్ బచ్చన్ లెక్కలేనంతగా ఫ్యాన్స్, ఫాలోవర్స్‌ను సొంతం చేసుకొన్నారు. ఆ లెజెండ్ మాదిరిగానే నేను కూడా దక్షిణాదిలో ఫ్యాన్స్‌ను, ఫాలోవర్స్‌ను పెంచుకోవాలని అనుకొంటున్నాను. ఏడు పదుల వయసులో కూడా బిగ్ బీ యువ హీరోలకు పోటీగా నటిస్తుండటం నాకు ఒకింత ఆశ్చర్యం వేస్తుంది. మరోపక్క స్ఫూర్తిగా కూడా ఉంటుంది అని అల్లు అర్జున్ అన్నారు.

 యువ హీరోలతో కలిసి పనిచేస్తా

యువ హీరోలతో కలిసి పనిచేస్తా

స్టార్‌డమ్‌ను అందుకోవడం చాలా కష్టమైన పని. అది ఒక్కో వ్యక్తికి ఒక్కోరకంగా ఉంటుంది. దానిని వ్యక్తిగతమైన జర్నీగా భావిస్తాను. స్టార్‌డమ్‌ విషయంలో నాకు అమితాబ్ ఆదర్శం. 70 ఏళ్ల వయసులో ఎలా ఉన్నారో.. నేను కూడా అలానే ఉండాలని భావిస్తున్నాను. ఆ వయసులో చాలా హ్యాపీగా యువ తారలతో కలిసి పనిచేయాలనే ఫీలింగ్ కలుగుతున్నది. అలా పనిచేయడం జీవితంలో ఓ అరుదైన గౌరవంగా భావిస్తాను అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

Recommended Video

Allu Arjun's Daughter Allu Arha Cute Video | Allu Arjun | Allu Arha | Allu Ayaan | Filmibeat Telugu
బిగ్ బీ కెరీర్‌లో

బిగ్ బీ కెరీర్‌లో

అమితాబ్ బచ్చన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం యువ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి దర్శకుడు షుజిత్ సర్కార్ దర్శకత్వంలో గులాబో సితాబో అనే చిత్రంలోను, అలాగే ఆయన్ ముఖర్జీ దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్, అలియాభట్ కలిసి నటిస్తున్న బ్రహ్మస్త్రలో కీలక పాత్రను పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X