న్యూ లుక్కుతో అదరగొట్టిన స్టైలిష్ స్టార్.. చాలా రోజుల తరువాత..
ఎప్పటికప్పుడు తన సినిమాలతో స్టైలిష్ స్టార్ అనే పదానికి సరైన అర్థం చెబుతున్నాడు అల్లు అర్జున్. ఎలాంటి లుక్కులో కనిపించినా కూడా ఆ లుక్ ట్రెండ్ అవ్వాల్సిందే. కెరీర్ మొదట్లో చూసిన బన్నీకి ఇప్పుడు చూస్తున్న బన్నీకి ఎంతగా మార్పు వచ్చిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విమర్శలు చేసిన వారి నోరు మూయించేలా తన టాలెంట్ తో సరికొత్తగా ఆకట్టుకుంటున్నాడు.
ఇక బన్నీ చాలా రోజుల తరువాత గీత ఆర్ట్స్ వద్ద కనిపించాడు. అక్కడ దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ క్యాజువాల్ గా అక్కడికి వెళ్లినట్లు చెప్పాడు. అయితే చాలా వరకు పనిని మిస్ అవుతున్నట్లు చెప్పిన బన్నీ ఇలాంటి కఠినమైన రోజులు వీలైనంత త్వరగా ఎండ్ అవ్వాలని కోరుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని కూడా బన్నీ పేర్కొన్నాడు.

ఇక ఎప్పటిలానే బన్నీ న్యూ ఫోటో వైరల్ గా మారింది. కొన్నిరోజుల క్రితం నిహారిక నిశ్చితార్థం వేడుకలో కూడా బన్నీ ఇదే లుక్ తో కనిపించిన విషయం తెలిసిందే. పుష్ప సినిమాలో మాస్ పాత్ర కోసం బన్నీ ఈ విధంగా లుక్ ని మెయింటైన్ చేస్తున్నాడు. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియదు. అయినప్పటికీ బన్నీ లుక్కును చేంజ్ చేయడం లేదు. షూటింగ్ ఏ సమయంలో మొదలైనా కూడా రెడీగా ఉండాలని అదే లుక్ ని ఫాలో అవుతున్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న విషయం తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఆ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.


Click it and Unblock the Notifications











